కలియుగదైవంగా భక్తులు కొలుచుకునే వడ్డీకాసులవాడు (శ్రీవేంకటేశ్వర స్వామి) తన వివాహం కోసం కుబేరుడు వద్ద తీసుకున్న అప్పు ఎంత అనే విషయంపై బెంగుళూరుకు చెందిన సమాచార హక్కు కార్యకర్తల(ఆర్టీఐ) టి నరసింహ మూర్తి ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఆయన టీటీడీకి దరఖాస్తు చేశాడు. 2012, ఫిబ్రవరి ఆరో తేదీన దరఖాస్తు చేసుకోగా, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. వాస్తవానికి తిరుమల వెంకన్నను వడ్డీకాసులవాడిగా భక్తులు కొలుచుకుంటుంటారు. పైగా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా వెంకన్న ప్రసిద్ధిగాంచాడు. స్వామి వారిని దర్శించుకునే...