తెలుగు దేశం మినిస్టర్ గంటా శ్రీనివాస రావు కుమారుడు గంటా రవితేజ త్వరలో హీరోగా లాంచ్ అవుతన్న సంగతి తెలిసిందే. తణికెళ్ల భరణి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ నేపధ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి తన కుమారుడుకి నటనలో కొన్ని టిప్స్ చెప్పి గైడ్ చేయమని కోరినట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు తో ఉన్న అనుబంధంతో పవన్ ఒప్పుకున్నాడని, గోపాల గోపాల షూటింగ్ అనంతరం పంపమని కోరినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక నాగార్జున సైతం ఈ కొత్త హీరోకు కొన్ని సలహాలు ఇచ్చారని, ఇప్పటికే నాగ్ ని కలిసారని వినపడుతోంది.
0 comments:
Post a Comment