పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక
గుర్తింపు తెచ్చుకున్న అలీ ఈమధ్య అవకాశం దొరికినప్పుడల్లా ఎవరో ఒకరిని
టార్గెట్ చేసి పంచ్ డైలాగులు వేస్తున్నాడు. ఆమధ్య యాంకర్స్ , హీరోయిన్స్ ని
ఉద్దేశించ్ అప్పుడప్పుడు బూతు పంచులు వేసిన అలీ తాజాగా ఇండస్ట్రీలోని
కమెడియన్స్ ని టార్గెట్ చేసుకున్నాడు. అయితే ఈసారి అందరిని కాకుండా
కమెడియన్స్ ఎవరైతే ఆ ట్రాక్ నుంచి తప్పుకొని హీరోగా చెలామణి అవుతున్నారో
వారిపై అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల
జరిగిన యమలీల 2 ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకలో ఈయన మాట్లాడుతూ ‘యమలీల హిట్
అవగానే నేను హీరోగానే సినిమాలు చేస్తానని కమెడియన్ పాత్రలు వదిలేస్తానని
అనుకున్నారు. కానీ నిర్మాత నిర్మాతగానే , గాయకుడూ గాయకుడిగానే ఉండాలి.
అలాగే కమెడియన్ కమెడియన్ గానే ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఏమి చేస్తే
ఆదరిస్తారో అలా నడుచుకుంటే సక్సెస్ పొందగలం. ఈ విషయాన్నీ అందరు
తెలుసుకోవాలి. ఇది తెలియక ఈమధ్య అందరూ చాలా వేరే మార్గాన్ని
చూసుకుంటున్నారు. కానీ నేను అలా చేయలేదు…ఆ సినిమా ఎంతపెద్ద హిట్
అయినా….నేను కమెడియన్ బాటను వదలలేదు.’ అన్నాడు అలీ. ఈ మాటలు ఇప్పుడు
పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఈమాటలు హీరో సునీల్ ని ఉద్దేశించి
అన్నట్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
0 comments:
Post a Comment