ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు నీతా అంబానీ, పింకీరెడ్డితో పాటు బాలీవుడ్ నటి జూహీ చావ్లా శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన నీతా, 11 కోట్ల 11 లక్షల 11వేల 111 రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు.
ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్‌తో అతలాకుతలమైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పునర్నిర్ణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుదూద్ తుఫాన్‌తో నష్టపోయిన విశాఖపట్నంలో జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.
0 comments:
Post a Comment