CSS Drop Down Menu

Monday, December 15, 2014

"నన్ను కొనుక్కోండి"... ఫేస్‌బుక్ లో ఓ యువతి

 
కటిక దరిద్రం... పోషించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు... తల్లిదండ్రులకు అనారోగ్యం... అప్పు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏం చేయాలి...? ఇక తనను తాను అమ్ముకోవడం మినహా మరే దిక్కూ లేదనుకుందా మహిళ. గుజరాత్ రాష్ట్రంలో ఓ మహిళ బాధలు భరించలేక తనను ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టుకున్న ఘటన పేదరికపు వెక్కిరింపు ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి చూపించింది. 
 
వడోదరకు చెందిన చాందిని రాజ్ గౌర్ అనే యువతి తన తల్లిదండ్రులకు చికిత్స చేయించేందుకు కావలసిన డబ్బు కోసం తనను తాను అమ్ముకుంటున్నట్లు ఫేస్ బుక్ లో తన ఫొటో పోస్టు చేసింది. ఆ ఫోటో కిందే ఎందుకు తనను తాను అమ్ముకోదలచిందో పేర్కొంది. తన తల్లిదండ్రులు మంచాన పడటంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే చూసుకుంటోంది. 
 
20 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి వడోదర చేరుకున్న చాందిని కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోయింది. ఆమె ఫేస్ బుక్ లో ప్రకటనను చూసి జాతీయ మీడియా సంప్రదించగా "నా తల్లిదండ్రుల కోసం నన్ను కొనండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తనకు ఇంతకన్నా మరో మార్గం లేదని వెల్లడించింది.
 


0 comments:

Post a Comment