కమలా పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
దాంతో పాటు బీటా కెరోటిన్, యాంటీ యాక్సిడెంట్లు, ఫోలేట్, నియాసిన్,
పాంటోథెనిక్ యాసిడ్, పిరిడాక్సిన్, రిబోఫ్లేవిన్ ఉంటాయి. ఇందులోని
మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. థయామిన్ ఆహారాన్ని శక్తిగా
మార్చడానికి దోహదం చేస్తుంది.
పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఒక కమలాపండు తింటే ఒక రోజు దేహానికి అవసరమైన ఏడవ వంతు పొటాషియం అందుతుంది.
ఊపిరితిత్తుల్లో కళ్లె చేరడం, ముక్కు కారడం, గుండె పట్టేయడం వంటి సమస్యలను
తగ్గిస్తుంది. దేహంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. దేహం లోపలి భాగాలతో పాటు
చర్మసౌందర్యాన్ని కూడా ఇనుమడింపజేస్తుంది. గాయాలు త్వరగా మానిపోయి చర్మం
మామూలు కావడానికి దోహదం చేస్తుంది.
క్యాన్సర్ కారక కణాల వృద్ధిని
అడ్డుకుంటుంది, గర్భిణులు కమలాపండ్లు తింటే మేలు. బిడ్డకు పుట్టుకతో వచ్చే
అవకరాలను నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
0 comments:
Post a Comment