ఓ పాము తనకు తానే ఆత్మహత్య చేసుకుంది! తన మెడను తానే కొరుక్కుని
చనిపోయింది. ప్రముఖ పత్రిక ది డెయిలీ మెయిల్ ప్రకారం... ఈ సంఘటన
ఆస్ట్రేలియాలోని కెయిన్స్‌లో జరిగింది. ఓ మహిళ తమ ఇంటి డోర్ స్టెప్స్ పైన ఓ
పామును చూసింది. 1.5 మీటర్ల పొడనున్న గోదుమ రంగు పామును ఆమె చూసింది.
దీంతో
ఆమె మట్ హాగన్ అనే పాములు పట్టే వాడికి సమాచారం అందించింది. అతను అక్కడకు
వచ్చాడు. దానిని పట్టుకుందామనుకున్నాడు. కాని, అంతలోనే ఆ పాము తన మెడను
తానే కరచుకొని మృతి చెందింది.
ఆ సమయంలో తాను దానిని సరిగా చూడకపోయి ఉంటానని అనుకున్నానని, దానిని తాను
పట్టుకొని చూశానని, అప్పటికి అది తన మెడను గట్టిగా నోట కరుచుకొని ఉందని
పాములు పట్టే వ్యక్తి మన్ హాగన్ చెప్పారు.
తనకు ప్రాణాపాయం ఉందని
అనుకుంటే పాములు సాధారణంగా కరిచి అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం
చేస్తాయని, కాని ఏ పాము తనంతట తాను చనిపోతుందని చూడలేదని చెప్పారు. అయితే,
అది ఏదైనా తీవ్ర బాధతో ఉండవచ్చునని, దీంతో తనకు తానే చనిపోవచ్చునని
అభిప్రాయపడ్డారు. కాగా, పాములు పగ పడతాయనే విషయం మనం వింటున్నాం. కానీ ఈ
పాము తనకు తానే చనిపోవడం గమనార్హం.
0 comments:
Post a Comment