CSS Drop Down Menu

Tuesday, May 29, 2018

2008 నుండి 2018 వరకు IPL క్రికెట్ లో విజేతలు ఎవరో తెలుసా?

IPL క్రికెట్ మ్యాచ్ లో ఇప్పటివరకు జరిగిన వాటిలో ఏఏ జట్లు ఎక్కువ  సార్లు విజేతలుగా నిలిచాయో తెలుసుకోవాలనుకొంటే ఈ క్రింది వీడియో చూడండి.  
ఈ వీడియో కనుక నచ్చితే like,share చేయండి. Subscribe చేయడం మాత్రం మర్చిపోకండి.






Friday, May 18, 2018

చిన్న పిల్లాడిలా ఏడ్చిన దర్శకుడు శంకర్ ! ఎందుకో తెలుసా ?



అపరిచితుడు చిత్రం వెనుక ఉన్న కష్టాన్ని తాజాగా స్టంట్ డైరెక్టర్ సిల్వ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సందర్భంలో జరిగిన ప్రమాదం వలన శంకర్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశారని సిల్వ తెలిపాడు.

అపరిచితుడు చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆ ఫైట్ చిత్రీకరణ సమయంలో జరిగిన అతి పెద్ద ప్రమాదాన్ని సిల్వ వివరించారు.





ఆ ఫైట్ కోసం దాదాపు 150 మంది స్టంట్ మేన్స్ ని ఉపయోగించాం. సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలిచిన ఫైట్ అది. విక్రమ్ ఒక్కడే వారందరితో పోరాడే సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

ఆ ఫైట్ చిత్రీకరణ సమయంలో దాదాపు 75 మంది స్టంట్ మెన్స్ గాల్లో ఎగరాల్సి ఉంటుంది. ఓ లారీకి తాడులు కట్టి వారంతా గాల్లో ఎగిరేలా ప్లాన్ చేసాం. శంకర్ యాక్షన్ చెప్పక ముందే డ్రైవర్ అనుకోకుండా లారీని కదిలించాడు. అప్పటికి స్టంట్ మెన్స్ సిద్ధంగా లేరు.

డ్రైవర్ చేసిన పొరపాటు వలన స్టంట్ మెన్స్ స్టేడియం టాప్ తగిలి కింద పడ్డారు. అందరికి గాయాలయ్యాయి. కొందరికి కంటి భాగంలో కూడా రక్తం కారింది. కొందరికి ఫిట్స్  కూడా వచ్చాయి . వేగంగా స్పందించడం వలన అందరిని రక్షించుకున్నాం అని సిల్వా తెలిపాడు.

దర్శకుడు శంకర్ ఆ సమయంలో చిన్న పిల్లాడిలా ఏడ్చేశారని సిల్వా తెలిపాడు. ఆయన్ని చూసి నేను కూడా తట్టుకోలేక పోయా అని సిల్వ తెలిపాడు. 2005 లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది అఖండ విజయం సాధించింది.



Thursday, May 10, 2018

Saturday, May 5, 2018

ఇలాంటి కలెక్టర్ ని ఎప్పుడూ చూసి ఉండరు.

కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అంటూ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కలెక్టర్. పేరు టి అన్బళగన్. తన కారు డ్రైవర్‌గా పని చేసి పదవీ విరమణ  పొందిన డ్రైవర్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలా ట్రీట్ ఇచ్చారు. ఆ డ్రైవర్ దంపతులను తన కారులో కూర్చోబెట్టుకుని స్వయంగా వారి ఇంటి వద్ద దింపి వచ్చారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు సైతం సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేసారు. ఈ వివరాలను పరిశీలిస్తే...


కరూర్ జిల్లా కలెక్టర్‌ కారు డ్రైవర్‌గా పరమశివమ్ 35 యేళ్ళపాటు సేవలు అందించారు. ఆయన తాజాగా పదవీ విరమణ చెందారు. దీంతో ఆయన కోసం సరికొత్తగా ఏదైనా చేయాలని భావించిన కలెక్టర్ విధుల చివరి రోజు డ్రైవర్ పరమశివమ్, అతడి భార్యను కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దింపాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం పరమశివమ్ చివరి రోజు ఫేర్‌వెల్ పార్టీ ముగిశాక డ్రైవర్ దంపతులను స్వయంగా కారు వద్దకు తీసుకెళ్లిన కలెక్టర్ అన్బళగన్ కారు డోర్ తెరిచి వారిని వెనక సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పరమశివమ్ ఇంటికి వెళ్లి దిగబెట్టారు. ఆ తర్వాత వారితో కొద్దిసేపు గడి.. వారిచ్చిన కాఫీ తాగి.. అక్కడ నుంచి తన కార్యాలయానికి వచ్చారు. ఇది చూసిన వారు పరమశివం 35 ఏళ్లపాటు అందించిన సేవలకు కలెక్టర్ సరైన గుర్తింపు ఇచ్చారని ప్రశంసించారు.

Wednesday, May 2, 2018

పడుకుంటామంటే వద్దంటారా ? ప్రకాష్‌ రాజ్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి అనే నటి క్యాస్టింగ్ కౌచ్‌ను తెరపైకి తీసుకువచ్చి తెలుగు సినీపరిశ్రమ మొత్తాన్ని రోడ్డుపైకి లాగిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్లు, నిర్మాతలతో పడుకోక తప్పదంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. 

ఆ తరువాత శ్రీరెడ్డి వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడారు. ఇదే విషయంపై తాజాగా నటుడు ప్రకాష్‌ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవకాశాల కోసం డైరెక్టర్లు, నిర్మాతలు నటీమణులను పడుకోమని ఎక్కడా చెప్పరు. ఒకవేళ చెప్పినా అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. 

అంతేకాదు కొంతమంది మేమే పడుకొంటాం మాకు అవకాశం ఇస్తారా అంటూ బ్రతిమలాడుతారు. ఏ మగాడైనా కోరి మరీ పడుకుంటామని అంటే వద్దనే వారు ఉన్నారా. ఎవరూ వద్దనుకోరు. వచ్చిన అవకాశాన్ని వాడుకుంటారు. అంతేతప్ప కొంతమంది దీనిపై చేస్తున్న రాద్దాంతం అనవసరం. దీనిపైన మాట్లాడాల్సిన అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్‌ రాజ్.