అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీ
ఫలితంగా దంపతుల మధ్య సఖ్యత చెడిపోతోంది. ఫలితంగా వేరుపడే (విడాకులు) జంటల
సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మొబైల్ టెక్నాలజీలో వచ్చిన విప్లవం కారణంగా
వాట్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నిరంతరం మెసేజ్‌లు
పంపుకోవచ్చు. ఇలా చేసే వారు ఇబ్బందుల్లో పడుతున్నట్టు తాజా పరిశోధనలో
వెల్లడైంది.
ఇటీవలి కాలంలో మంచి ఆదరణ చూరగొన్న వాట్స్
యాప్ మెసెంజర్ వేదిక, వివాహితులు విడాకులు తీసుకునేందుకు కారణమవుతుందని
'ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్స్' అధ్యక్షుడు గియాన్ ఎట్టోర్
గస్సానీ తెలిపాడు.
ఈ మేరకు లండన్ టైమ్స్ పత్రికతో మాట్లాడిన
అతను, "వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లు చేస్తూ జీవిత భాగస్వాములను
మార్చుకుంటున్నట్టు 40 శాతం విడాకుల కేసుల్లో తెలిసింది. ఈ విషయంలో వారి
ప్రేమికులే సాక్ష్యంగా ఉంటున్నారు" అని చెప్పారు. ఇటలీలో సోషల్ మీడియా
మోసాన్ని చాలా సులభంగా ప్రోత్సహిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా
ఉపయోగిస్తుండటంతో... ముందు టెక్స్ట్ సందేశం, తరువాత ఫేస్ బుక్, ఇప్పుడు
వాట్స్ యాప్ ద్వారా ఇలా చేస్తోందన్నారు.
Avunaa....nijamena?
ReplyDelete