CSS Drop Down Menu

Friday, December 5, 2014

"శృంగారం" పై " ఆసక్తిని, సామర్థ్యాన్ని" పెంచే ఆహారపదార్థాలు !

 
ప్రతిరోజూ సెక్స్‌లో పాల్గొనడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే! రోజూ సెక్స్ చేయడం ద్వారా ఆనందాన్ని అనుభవించడంతోపాటు శరీరానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయి. 
 
అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో పెళ్లైన జంటలకు శృంగారానికి సమయం లేదు. పురుషులు పాల్గొనాలని అనుకున్నా రోజంతా పనిచేసి అలసిపోవడం వల్ల రతిక్రీడలో పాల్గొనేంత ఆసక్తి వుండడంలేదు. ఇక మహిళలు సంగతీ సరేసరి ఇంటా బయట అంటూ పనులు చేసి నీరసించిపోవడంతో సెక్సులో పాల్గొనేంత ఆసక్తి వారిలోవుండదు. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతోపాటు ఆరోగ్యకరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.
 
ప్రతిరోజూ సెక్స్‌ను తనివితీరా పూర్తి అనుభవించాలంటే సెక్స్‌పై ఆసక్తిని, సామర్థ్యాన్ని పెంచే ఆహారపదార్థాలను తీసుకోవడం మంచింది. సెక్స్‌లో పాల్గొనేందుకు ముందు ఆ ఆహారాలను తీసుకుంటే.. అవి రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి అందించడంతోపాటు, భాగస్వామితో శృంగారంలో పాల్గొనేలా హార్మోనులను ప్రేరేపిస్తాయి. అంతటి మేలు చేసే ఆహార పదార్థాలు ఇవిగో మీ కోసం...
 
బెడ్‌పైకి ఎక్కే ముందు రెండు ముక్కలు డార్క్ చాక్లెట్ నోట్లె వేసుకున్నారంటే సరి. అటు స్వీటుకు స్వీటు ఇటు ఇందులో ఉండే థియోబ్రొమైన్ అనే కంటెంట్ నేచురల్ ఎనర్జీని పెంచి, సెక్సీ మూడ్ మీకు అందిస్తుంది.
 
సెక్స్‌ స్టామినాను పెంచడంలో తేనె బాగా పని చేస్తుంది. ఇందులో బిటమిన్-బి అధికంగా వుంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మహిళలు దీనిని తీసుకుంటే వారిలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.
 
పడకెక్కే ముందు పాలు తాగడం మంచిదే, అందునా బాదం పాలు మరి మంచిది. అవి శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. తద్వారా త్వరగా అలసిపోకుండా సెక్స్‌లో మీరు రెచ్చిపోవచ్చు. 
 
సెక్స్ సామర్థ్యం పెరగాలంటే రక్త ప్రవాహాం మెరుగుపడాలి అందుకు దానిమ్మ పండు బాగా ఉపకరిస్తుంది. బెడ్ రూంలోకి వెళ్లే ముందు దానిమ్మ పండుకానీ, దానిమ్మ రసంగానీ తీసుకుంటే సెక్స్‌కు వేగంగా సిద్ధమవుతారు. 
 
సెక్స్‌కు ముందు ఒక క్యారెట్ తిని చూడండి. ఇందులో మానవ శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్స్ ఎన్నో వుంటాయి. ఫలితంగా ఎనర్జీ కూడా పెరుగుతుంది.
 
శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో టమోటో బాగా పని చేస్తుంది. ఇందులో లైకోపిన్ అనే అంశం సెక్స్ సామర్థ్యంను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రి తీసుకునే ఆహారంలో టమోటాలను కాస్త ఎక్కువగా జోడిస్తే.. ఫర్ఫెక్ట్ లవ్ మేకింగ్ నైట్ కోసం స్టామినా అందిస్తుంది.

1 comment:

  1. డార్క్ చాకొలేట్+హనీ+బాదామ్ మిల్క్+పోమోగ్రేనేట్+కారెట్ లతో సమ పాళ్ళ లో చేసిన 'సురా'పానీయమును సేవించుడు !!

    జిలేబి

    ReplyDelete