గతంలో హీరోయిన్స్‌గా ఓ ఊపు ఊపి, పెళ్లయ్యాక
వెండితెరకు గ్యాప్ ఇచ్చి, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న
కొంతమంది కథానాయికలు ఇప్పుడు కళ్ళు తిరిగే పారితోషికాలను
పుచ్చుకుంటున్నారు.
ఇప్పటికే ఈ విషయంలో అరవై లక్షలు తీసుకుంటూ
నదియా వార్తల్లో నిలవగా, తాజాగా రమ్యకృష్ణ కూడా రికార్డు స్థాయిలో
రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తోంది. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న
'ఆంబళ' సినిమాలో నటించడానికి ఆమె ఏకంగా 90 లక్షలు తీసుకుంటున్నట్టు
కోలీవుడ్ సమాచారం.
ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ
సినిమాలో ఆమె విశాల్‌కు అత్తగా నటిస్తోంది. ఇందుకు గాను రోజు వారీ వేతనంగా
3 లక్షలు చార్జ్ చేస్తోందట. అంటే ఈ సినిమాకు మొత్తం 30 రోజుల డేట్స్
ఇచ్చింది. సో ... ఆ విధంగా ఈవిడ గారి మొత్తం పారితోషికం చూసుకుంటే 90
లక్షలన్న మాట. లేటు వయసులో లక్ అంటే ఇదేనేమో!
0 comments:
Post a Comment