CSS Drop Down Menu

Thursday, December 4, 2014

"బాలయ్య" వందో సినిమాలో "పవన్" ?

టాలీవుడ్లో సంచలనాలు సృష్టించే నందమూరి బాలకృష్ణ త్వరలోనే మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం 98 వ సినిమాలో నటిస్తున్న బాలయ్య , 99 వ సినిమా కోసం పలువురు దర్శకుల కథలని సిద్దం చేసుకుంటున్నారు . 98 వ సినిమా పూర్తికాలేదు ,99 మొదలు కాలేదు కానీ అప్పుడే 100 సినిమా గురించి పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఓ సంచలన వార్త పరిశ్రమలో వినిపిస్తుంది.

అదేమిటంటే బాలయ్య వందో సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తాడట. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ , నిజం కాదని మాత్రం కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వీరిద్దరూ కలసి నటించమని ఎప్పుడు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ వందో సినిమా లో పవన్ కళ్యాణ్ ఓ అతిధి పాత్రలో చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం గోపాల గోపాల సినిమాలో నటిస్తున్నట్లుగానే బాలయ్య వందో సినిమాలో నటిస్తాడని అంటున్నారు.

మరో గాసిప్ ఏమిటంటే… ఈ సినిమా బాలకృష్ణకు సింహ , లెజెండ్ తో వరుసగా రెండు హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. వినేందుకు ఆసక్తిగా , క్రేజీగా ఉన్న కాంబినేషన్ కార్యరూపం దాల్చడానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న 98 వ సినిమా పుర్తవ్వాలి , ఆ తర్వాత 99 సినిమా చేశాక వందో సినిమా వస్తుంది కాబట్టి.

0 comments:

Post a Comment