CSS Drop Down Menu

Monday, December 29, 2014

ఒక్క రాత్రి కి "5 కోట్లా " ?


దేశంలో అమ్మాయిలే లేరన్నట్లుగా అందరూ పోర్న్ స్టార్ నే పట్టుకుంటున్నారు. హాట్ అనే మాట వచ్చిందంటే సన్నీని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అంతలా డిమాండ్ ఉంది కాబట్టే.., మోడిని సైతం దాటుకుని దేశంలోనే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న సెలబ్రిటీగా నిలిచింది సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోలకు హీటు పెంచుతూ.., హీరోయిన్లకు ఈర్ష్య పుట్టిస్తున్న హాట్ గర్ల్ నూతన సంవత్సర వేడుకలను హైదరాబాద్ లోనే జరుపుకుటుందట. సినిమాలిచ్చే బాంబే కంటే భాగ్యనగరంపై ఎందుకంత ప్రేమా.. అంటే డబ్బులొస్తున్నాయి కదా అని చెప్తోంది.

నూతన సంవత్సర వేడుకల కోసం రెడి అవుతున్న హైదరాబాద్.., చలిని తొలగించి ఆ రాత్రిని వేడెక్కిందుకు సన్నీని పిలుస్తోంది. ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకులు సన్నీతో స్పెషల్ డాన్స్ షో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ లోని ఓ కన్వెన్షన్ హాల్ లో జరిగే ఈ కార్యక్రమంలో ఏడాదిలో చివరి రోజు రాత్రి చివరి క్షణాల్లో పోర్న్ పాప ఆడి పాడనుందట. అయితే కన్వెన్షన్ హాలు పేరు సీక్రెట్ గా ఉంచారు. ఈవెంట్ కోసం భారీగానే వసూలు చేస్తున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఒక్క రాత్రి షో కోసం ఎవరూ ఊహించని విధంగా రూ. 5కోట్లు డిమాండ్ చేసిందట. బేబీకి ఉన్న డిమాండ్ తో ఈవెంట్ నిర్వాహకులు సరే అని తల ఊపేశారట ( బహుశా అమ్మడిని చూస్తూ నోట మాట రాలేదేమో).

హీటర్ కన్పిస్తే.., చలికాచుకోకుండా మగానుభావులు ఆగరని ఊహించి సన్నీకి గట్టి భద్రత కల్పిస్తున్నారు. పది మంది గార్డులను పెట్టారు. వీరితో పాటు కండలు బలిసిన బౌన్సర్లను కూడా పెట్టి అందాలకు అదనపు రక్షణ కల్పిస్తున్నారు. రక్తం గడ్డ కట్టే రాత్రి చలిలో.., అర్ధ రాత్రి మద్దెల దరువు అన్నట్లుగా సన్నీ లియోన్ డాన్స్ ఎలా ఉంటుందో అని ఇప్పుడిప్పుడే అందరూ తహతహలాడుతున్నారు. ఇక ఈ ఈవెంట్ కు టికెట్లు, ఎంట్రీ పాసులు ఇప్పటికే బుక్ అయినట్లు సమాచారం. సన్నీయా మజాకా.


0 comments:

Post a Comment