CSS Drop Down Menu

Wednesday, December 10, 2014

నిమ్మ, బత్తాయి "తొక్కల"ను పారేస్తున్నారా?

 
నిమ్మ, బత్తాయి తొక్కలను పారేస్తున్నారా? కాస్త ఆగండి. నిమ్మరసం కానీ, బత్తాయి రసం కానీ తీసిన తర్వాత తొక్కని ఇక నుంచి పారేయకండి. ఎందుకంటే సిట్రస్ జాతి పండ్ల తొక్కలను ఇంట్లో అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. 
 
ఎలాగంటే.. 
*  గోరు వెచ్చని నీటిలో ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కను వేసి స్నానం చేయండి. ఇది శరీరాన్ని, వెంట్రుకలనూ తాజాగా ఉంచుతుంది. 
 
* నిమ్మ, కమలా, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ తొక్కలను ఒక చిన్న గిన్నెలో వేసి దాన్నిండా నీటిని పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఫ్రిజ్‌లోని చెడు వాసనలు పోతాయి.
 
* సిట్రస్ జాతి పండ్ల తొక్కలకు కొద్దిగా బ్రౌన్ షుగర్‌ను అద్ది అర చేతులకు మోచేతులకు రుద్దితే మొరటుదనం పోయి కోమలంగా తయారవుతాయి. 
 
* సిట్రస్ ఫ్రూట్స్ పండ్ల తొక్కలను అండర్‌గార్మెంట్స్ ఉన్న సొరుగులో ఉంచితే, బట్టల నుంటి మంచి వాసన వస్తుంది. 
 
* నిమ్మ, నారింజ తొక్కలు నానబెట్టిన నీటితో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన ఉండదు. ఈ తొక్కలను నమిలితే దంతాలకు, చిగుర్లకూ ఎంతో మంచిది. 


0 comments:

Post a Comment