గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడవడైన నేమి ఖరము పాలు
భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభి రామ వినుర వేమా...!
అది అప్పుడు వేమన చెప్పిన పద్యం. కానీ ఇప్పుడు గంగిగోవు పాలును మించి ఖరము పాలు అధిక రేటును పలుకుతోంది. ఇది హాస్యానికి చెప్పే మాట కానే కాదు. ఆవు పాలు కావాలంటే మీ ఇంటి ముంగిటకు వచ్చి లీటర్లకు లీటర్లు చేరిపోతాయి. కాని గాడిద పాల కోసం అక్కడ క్యూ కడుతున్నారు. అదే లీటరో, రెండు లీటర్ల కోసమే కాదు. రెండు మూడు మిల్లీ లీటర్ల కోసమే. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న యదార్థం.
గాడిద పాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉందనే విషయం బయట పడిందే ఆలస్యం జనం వాటి కోసం వెంపర్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక చోటు కాదు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకూ అలాగే తెలంగాణలో అదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకూ ఇదే వ్యాపారం సాగుతోంది. ఓ గాడిదను తోలుకుని నగరాల్లో వీధివీధి తిరుగుతూ గాడిద పాలు అమ్మడానికి దర్శనమిస్తున్నారు.
ఆదిలాబాద్‌కు చెందిన రాజు అనే యువకుడు ఓ గాడిద పాలతోనే వేలాది రూపాయలు సంపాదించేస్తున్నాడు. సాధారణంగా గేదెలు, ఆవులు ఇచ్చినట్లుగా గాడిద లీటర్లకు లీటర్లు పాలు ఇవ్వదు. మహా అంటే లీటరు పాలు ఎక్కువ. అర లీటరు ఇచ్చే గాడిదలే ఎక్కువ. 10 మిల్లీ లీటర్లు పాలు రూ. 100 నుంచి 200 వరకూ పలుకుతున్నాయి. లీటర్ పాలు కనీసం రూ. 5 వేల రూపాయలు పలుకుతున్నాయి. చంటి పిల్లలకు ఒక స్పూన్ గాడిద పాల కోసం ఎగబడే జనం కూడా ఉన్నారు. అసలు ఈ గాడిద పాలతో ఏం ప్రయోజనాలున్నాయో చూద్దాం.
1. ఇందులో పెద్ద మొత్తంలో బి, బి12, సి విటమిన్లలతోపాటు న్యూట్రిన్లు ఉంటాయి.
2. తల్లి పాలతో సమానమైన స్థాయిలో కాలరీలు, మినరల్స్ ఉంటాయి. ఈ పాలు గేదె పాలతో సమానమైన బలం ఉంటుందని భావిస్తారు.
3. అప్పుడే పుట్టిన పిల్లల్లోని ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నివారణకు గాడిద పాలతో పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది.
4. అప్పుడే పుట్టిన పిల్లలో క్షయ, ఆస్తమా, గొంతు సంబంధిత వ్యాధుల నివారణకు తయారుచేసే ఆయుర్వేద మందులలో గాడిద పాలను వినియోగిస్తారు.
5. గాడిద పాలలో ప్రొటీనులు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కానీ మినరల్స్, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి.
6. ఆవులు వల్ల వచ్చే అలెర్జీ సంబంధిత వ్యాధులకు గాడిద పాలతో నయమవుతాయి.
7. నవజాత శిశువులకు పూర్తి ఆహారాన్ని అందించడంతోపాటు వారిలోని చర్మవ్యాధులను నయం చేస్తుంది.
8. గాడిద పాలలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్లో ఎముకల పటిష్టత, విరిగిన ఎముకలను అతికించే స్వభావం అధికంగా ఉంటుంది.
9. తల్లిపాలతో పోల్చుకుంటే కనీసం 60 రెట్ల విటమిన్ సి ఉంటుంది. అందుకే గాడిద పాల కోసం ఎగబడుతున్నారు.

0 comments:
Post a Comment