CSS Drop Down Menu

Thursday, December 11, 2014

"మానవమలం"తో నడిచే 'పూ బస్'


రీసైకిల్ ప్రాసెస్ చేయాలే కానీ, పనికిరానిదంటూ ఏదీ లేదు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు మరోసారి నిరూపించారు. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న బస్సును చూశారా.. ఇది మానవ 'అశుద్ధం'తో నడిచే బస్సు. వినడానికి ఎబ్బెట్టుగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం.



'పూ బస్'గా పిలిచే ఈ బస్సు మానవ వ్యర్థం, ఆహారా పథార్థాల వ్యర్థాల నుంచి విడుదలయ్యే గ్యాస్‌తో నడుస్తుంది. యూకేలో కెల్లా మొట్టమొదటిదైన ఈ తరహా బస్సు, బ్రిస్టల్ సెవేజ్ వర్క్స్ నుంచి వచ్చే వ్యర్థం మరియు ఇతర వ్యర్థాలతో కలిసి వచ్చే బయోమీథేమ్ వాయువను ఇంధంగా చేసుకొని నడుస్తుంది.

ఈ బయో బస్సులో 40 సీట్లు ఉంటాయి. ఫుల్ ట్యాంక్ గ్యాస్‌పై ఇది 300 కిలోమీటర్ల దూరం (186 మైళ్లు) ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ బస్సును యూకేలోని బ్రిస్టల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బాత్ సిటీ సెంటర్ వరకూ ఆపరేట్ చేస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఏడాది పాటు విసర్జించే 'అశుద్ధం'తో ఒక ఫుల్ ట్యాంక్ బయోమీథేన్ ఫ్యూయెల్‌ని తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఇదొక చక్కటి మార్గం, అంతేకాకుండా బయోమీథేన్‌తో ఈ నడిచే ఈ బస్సులు డీజిల్ ఇంధనంతో నడిచే బస్సులతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తాయని వారు తెలిపారు. ఈ వాయువు దుర్ఘంధం వెదజల్లకుండా ఉంచేందుకు సరైన ప్యూరిఫికేషన్ విధానాన్ని పాటిస్తున్నారు. ఫలితంగా ఇది పర్యావరణాన్ని, మానవాళికి హాని కలిగించదు. ఇదంతా వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ, మన వేస్టే మనల్ని మోసుకెళ్తుందన్నమాట.



0 comments:

Post a Comment