సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను
అలరించడానికి వస్తాడంటున్న గోపాలుడు వెన్నక్కి తగ్గినట్లు సమాచారం. దీనికి
కారణం తన సోదరుడి కుమారుడు తొలి చిత్రం 'ముకుంద' కూడా సంక్రాతికి విడుదల
కావడమేనట. మొదటగా గోపాల గోపాల సినిమాను పండుగకు విడుదలచేస్తామని ఆ చిత్ర
నిర్మాతలు ప్రకటించారు. ఆ వెంటనే ముకుంద యూనిట్ కూడా తమ సినిమా కూడా జనవరి
విడుదలకు రెడీ అవుతోందని ప్రకటించింది. దీంతో బాబాయ్, అబ్బాయ్ సినిమాలు
ఒకేసారి రావల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సినిమా వల్ల అబ్బాయ్ సినిమాకి
ఎలాంటి ఇబ్బంది రాకుండా వుండాలని భావించిన బాబాయ్ 'గోపాల గోపాల' రిలీజ్ ను
మార్చాలని నిర్మాతలతో రాయబారం నడుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
మరి తాను అభిమానించే అన్నయ్య కుమారుడి తొలి సినిమా వస్తుంటే దానిపై పోటికి
పవన్ ఒప్పుకుంటాడా?
0 comments:
Post a Comment