త్రిష అంటే గ్లామర్ నటనకు పెట్టిందిపేరు.
ఆమె దక్షిణాది ఫిలిమ్ ఇండస్ట్రీని తన గ్లామర్ తో చానాళ్లు ఏలేసింది. ఐతే
ఇటీవల కొద్దిగా ఆఫర్లు తగ్గినా ఆమె కోసం కొందరు నిర్మాతలు ఇంకా ఎగబడుతూనే
ఉన్నారు. ఈమధ్య టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత నేరుగా త్రిషను
సంప్రదించాడట.
తను తీయబోయే చిత్రంలో మంచి హాట్ పాత్ర
ఉందనీ, అందులో నటించేందుకు సై అంటే అడిగినంత పారితోషికం ఇస్తానన్నాడట. అంతే
త్రిషకు కోపం నషాలానికి అంటిందట. వెంటనే పైకి లేచి... ఇక్కడ నుంచి
వెళ్లకపోతే చెప్పుతో కొడతా అంటూ సెక్యూరిటీ చేత అతడిని బయటకు పంపిందట.
మొత్తానికి ఆఫర్లు తగ్గినా త్రిష ఇంకా ఆ రేంజిలోనే ఉందంటూ సదరు నిర్మాత
గొణుక్కుంటూ వెళ్లిపోయాడట.
0 comments:
Post a Comment