టాలీవుడ్ దర్శకులంతా తమ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేశారు. ఇలా పెంచిన వారిలో ప్రముఖ దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, శ్రీను వైట్ల, తదితరులు ఉన్నారు. వీరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ దర్శక రచయిత టాలీవుడ్‌కు 2002లో రాగా, ఇప్పటి వరకు కేవలం 6 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఏడో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అయినప్పటికీ.. ఈ క్రియేటివ్ డైరక్టర్ ఒక చిత్రం దర్శకత్వం వహించేందుకు తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా రూ.16 కోట్లు. అత్తారింటికి దారేది చిత్రానికి రూ.7 కోట్లు తీసుకున్న ఈ దర్శకుడు అల్లు అర్జున్ చిత్రానికి దర్శకత్వం చేసేందుకు రూ.16 కోట్లు పుచ్చుకుంటున్నాడట. ఇదే టాలీవుడ్ దర్శకులు తీసుకునే అత్యధిక రెమ్యునరేషన్. అలాగే వివి వినాయక్ కూడా రెట్టింపు చేశాడట. అల్లుడు శీను చిత్రానికి వినాయక్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.9 కోట్లు. అదేవిధంగా శ్రీనువైట్ల కూడా మహేష్ బాబు ఆగడు చిత్రానికి రెట్టింపు చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

0 comments:
Post a Comment