CSS Drop Down Menu

Tuesday, December 23, 2014

నాగ్ బాడీ సీక్రెట్‌...?


 సినిమా ఫీల్డు అంటే గ్లామర్‌. ఎప్పుడూ అందంగా కన్పించాలని హీరోలు హీరోయిన్లు తాపత్రయపడుతుంటారు. అందుకు తగినవిధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి ఎంతైనా ఖర్చుపెడతారు. హీరోయిన్లు మాత్రం ఇందుకు చాలా కేర్‌ తీసుకుంటారు. హీరోల్లో నాగార్జున ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడనేది ఇండస్ట్రీలో నెలకొంది. అసలు నాగార్జున హెయిర్‌ నిజమా కాదా? అనేది కూడా అనుమానమే. ఈ విషయమై ఓసారి ఓ ప్రముఖ వ్యక్తి కామెంట్‌ చేస్తే ఆ వ్యక్తిపై విరుచుకుపడ్డాడు కూడా. తన జుట్టును గట్టిగా పట్టుకుని మరీ చూపించాడు షూటింగ్‌లోనే.

అయితే తన ఆరోగ్యం మాత్రం తన తండ్రి నుంచే నేర్చుకున్నానని చెబుతాడు. ఎర్లీగా లేచి తగు వ్యాయామాలు ఫుడ్‌ తీసుకోవడం అనేది అందరికీ చెప్పేస్తాడు. కానీ అందరి హీరోల్లో శరీరంలో మార్పులు వస్తూ కాస్త వయసు తేడాలు కనిపిస్తుంటాయి. కానీ నాగార్జునలో అలాంటి మార్పు కన్పించదు.

మన్మథుడుగా వుంటాడని సినిమావాళ్లు రివ్యూల్లోనూ రాస్తుంటారు. బయట కూడా అలాగే చెబుతుంటారు. కానీ ఇదే విషయం ఇటీవలే మీలో ఎవరు కోటీశ్వరుడు ఓ వ్యక్తి అడిగితే... అది సీక్రెట్‌.. ఎవరికీ చెప్పేది కాదని సింపుల్‌గా తేల్చేశాడు. అంటే ఎవరికీ తెలీని బాడీ సీక్రెట్‌ను నాగ్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడన్నమాట.

0 comments:

Post a Comment