CSS Drop Down Menu

Saturday, December 13, 2014

ప్రవర్తన మార్చుకోకపోతే "ధన్‌రాజ్‌ కు ఇక్కట్లే" ?

పలు స్కిట్స్‌లో బుల్లితెరపై అలరిస్తూ సినిమాల్లో పలు పాత్రలు పోషించిన ధన్‌రాజ్‌ నటుడిగా తనకంటూ ముద్ర వేసుకున్నాడు. కానీ.. వ్యక్తిగతంగా కొన్ని తప్పులు చేయడంతో ఆయనకు కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. గతంలో మందుకొట్టి పబ్‌లో ఏదో హడావుడి చేశాడని పోలీసులు కేసు కూడా వుంది. ఆ తర్వాత షూటింగ్‌లో చిన్న చిత్రాలయితే.. వారిపై ఏదో సాకుతో ఏదోవిధంగా ఏదో చేస్తాడట. 
 
తనే దర్శకుడిగా హ్యాండిల్‌ చేసే సందర్భాలు పలు వున్నాయి. కొత్త ఆర్టిస్టులపై ఎకసెక్కాలాడటం వంటి సందర్భాలు కూడా వున్నాయి. తాజాగా ఆయన పులిరాజు అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అదికాకుండా ఇటీవలే మంచు లక్ష్మీ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 
 
ఓపెనింగ్‌ రోజే లక్ష్మీతో కలిసి నటిస్తున్నాడని ప్రకటన ఇచ్చారు. ఏమైందో కానీ ప్రస్తుతం ధన్‌రాజ్‌ను తీసేసినట్లు తెలిసింది. ఇతని దుందుడుకు చర్యకు ఇదొక నిదర్శనమని ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.

0 comments:

Post a Comment