’గబ్బర్ సింగ్’తో అభిమానులను అలరించిన పవన్ ఇప్పుడు సొంతకథతో రెట్టింపు
వినోదాలను అందించేందుకు రెడీ అయ్యాడు. అవునూ.. త్వరలోనే గబ్బర్ సింగ్2
పట్టాలెక్కనుంది. పవర్ ఫుల్ కామెడీ ట్రాక్ తో పవన్ కథని సిద్ధం చేశాడు.
’పవర్’ ఫేం 'బాబీ' దర్శకత్వం వహించనున్నాడు. పవన్ కళ్యాన్
క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్ నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైనర్
సంయుక్తంగా నిర్మించనున్నాయి. శరత్ మరార్ నిర్మాత. వచ్చే నెలలో సెట్స్ పైకి
వెళ్లనుంది. పవన్ సరసన అనీషా ఆంబ్రోస్ జతకట్టనుంది. ఎంతో మంది అందగెత్తెలు
పవన్ పక్కన నటించేందుకు వేయికళ్లతో ఎదురు చూస్తున్నా.. ఆ అవకాశం అనీషాకు
దక్కడం విశేషం. చిత్ర బృందం మరో క్లారిటీని కూడా ఇచ్చింది. ఈ చిత్రం గబ్బర్
సింగ్ కు సిక్వీల్ కాదట. అసలు ఏ చిత్రానికి సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ కాదని స్పష్టం చేశారు. అన్నట్టు.. గబ్బర్
సింగ్ అంతాక్షరి గ్యాంగ్ మరోసారి హంగామా చేయనుంది. ఈ చిత్రానికి ఆర్ట్ ఆనంద
సాయి, సంగీతం దేవీశ్రీ ప్రసాద్.
0 comments:
Post a Comment