CSS Drop Down Menu

Wednesday, December 3, 2014

"అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్" చేసిన సచిన్.


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటపుడు ఓసారి ఆరోగ్య సమస్యతో ఎలా బాధపడిందీ... అలాగే ఆ సమస్యతోనే బ్యాటింగ్ ఎలా చేసిందీ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో వెల్లడించారు. 2003 ఐసీసీ ప్రపంచ కప్ సూపర్ సిక్స్ దశకు వచ్చిన సమయం... శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తనకు అపుడే విరేచనాలు పట్టుకున్నాయి. వేరే దారి లేక ఈ మ్యాచ్‌లో అండవేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని ఆ పుస్తకంలో చెప్పుకున్నాడు. 
 
సచిన్ తన ఆత్మకథ పుస్తకంలో ఇలా రాశాడు... "మ్యాచ్‌కు ముందే కడుపులో విపరీతమైన గడబిడ. డీహైడ్రేషన్ అని తెలిసిపోయింది. పాక్ తో మ్యాచ్ సమయంలోనే అది మొదలైంది. దాన్నుంచి కోలుకోక ముందే లంకతో మ్యాచ్. అప్పటికీ ఐసోటోనిక్ డ్రింక్స్ తీసుకున్నా.. అబ్బే ఏం మార్పు లేదు. దాంతో ఎనర్జీ డ్రింక్‌లో ఓ టీస్పూన్ ఉప్పును కలుపుకుని తాగేసరికి సీన్ రివర్స్ అయింది. 
 
కడుపులో ఒకటే తిప్పడం. ఏమి చేయాలో, ఎలా ఆడాలా అనుకుని చివరికి అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేశా. డ్రింక్స్ విరామ సమయాల్లో డ్రెస్సింగ్ రూమ్ కు పరిగెత్తి ఆ టిష్యూ పేపర్లు మార్చుకున్నాను." అంటూ ఆనాటి తన కష్టాలను సచిన్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ 120 బంతుల్లో 97 పరుగులు చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్పించాడు సచిన్.

0 comments:

Post a Comment