కర్నాటకలోని హెచ్.డీ.కోట్ తాలూకా షోలాపూర్ గ్రామంలో ఇదో విచిత్రం..అక్కడ భాస్కర్ అనే వ్యక్తికి చెందిన మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కన్నది. అయితే ఇవి కాసేపటికే మరణించాయి. మొదట మగపిల్ల ఈ ఉదయం ఆరున్నర గంటలకు పుట్టగా, ఐదు గంటల తరువాత పుట్టిన రెండోది ఆడపిల్ల అని భాస్కర్ తెలిపాడు. వీటికి కళ్ళు, ముక్కు, నోరు అంతా మనిషి పోలికలే ఉన్నా చెవులు, కాళ్ళు మాత్రం మేకను పోలి ఉన్నాయన్నాడు.
నేను నాలుగేళ్ళుగా ఈ మేకను పెంచుతున్నానని, ఇప్పటివరకు దీనికి పుట్టిన పది పిల్లలు సాధారణంగానే ఉన్నాయి అని అతగాడు చెప్పాడు. ఏది ఏమైనా ఈ విచిత్రం ఆ గ్రామమంతా సంచలనం రేపింది. జనాలు పెద్దసంఖ్యలో వచ్చి ఈ వింతను చూశారు. ఇలా విచిత్రంగా మేకపిల్లలు పుట్టడం అరిష్టమని. ఈ మేక పిల్లల్ని భూమిలో పాతిపెట్టాలని కొందరు భాస్కర్‌కు సలహా ఇచ్చారు. అయితే మరికొందరు వీటిని భద్రపరచాలన్నారు. కాగా- జన్యుపరమైన లోపాలవల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుందని అభ్యుదయవాదులు అంటున్నారు.
0 comments:
Post a Comment