నటుడి ఇమేజ్ పెరిగితే అతడిపై ఎంట్రీ
షాట్ రూపంలో భారీగా డబ్బులు వెదజల్లుతారు. అలాంటి సంఘటనే పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ విషయంలోనూ జరిగింది. గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్
కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన
షూటింగ్ విషయాల్లో చిత్ర యూనిట్ హై క్వాలీటిని మెయింటెన్ చేస్తున్నట్లు
షూటింగ్ స్టార్టింగ్ రోజు నుంచి తెలిసిన విషయమే.
కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా
కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కోసం సుమారు 50
లక్షలతో విజువల్ వండర్‌ని క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విజువల్ ను
పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కన్పించేటపుడు ఉపయోగిస్తారని సమాచారం.
0 comments:
Post a Comment