కొరియోగ్రఫర్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు ప్రభుదేవా. తనదైన డ్యాన్నింగ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. నృత్యం నుంచి.. నటన
వైపు అడుగులేశాడు. పలు సినిమాల్లో నటించాడు. అటు.. నుంచి దర్శకుడిగా
మారాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రభు
సినిమాలన్నీ వందకోట్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. డైరెక్షన్ చేస్తూనే..
అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు విలనీజం
చూపించడానికి రెడీ అయిపోయాడు ప్రభుదేవ. ఆయన రీల్ లైవ్ లోనూ.. రియల్
కొరియాగ్రాఫర్ గా నటించిన చిత్రం ’ఎబిసిడి’. ఈ సినిమా సీక్వెల్ ‘ఎబిసిడి 2′
ప్రస్తుతం సెట్స్ పై ఉంది. రెమో డిసౌజా దర్శకడు. వరుణ్ ధావన్, శ్రద్ధ
కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా పూర్తి నెగటివ్ షేడ్స్
వున్న పాత్రలో కనిపించనున్నాడు. మరీ.. ప్రభుదేవా విలనీజం ఏ రేంజ్ లో
వుండబోతుందో వేచి చూడాలిల్. అన్నట్టు.. తెలుగులోనూ ‘ఎబిసిడి2′ రానుంది.
0 comments:
Post a Comment