థైరాయిడ్ పురుషుల కంటే మహిళలనే అధిక శాతం
వేధిస్తోంది. శరీరంలో అయోడిన్ శాతం తక్కువగా ఉండటం వల్లే థైరాయిడ్ సమస్య
ఏర్పడుతుంది. థైరాయిడ్ యుక్త వయస్సు అమ్మాయిలనే అధికంగా సోకుతుందని తాజా
అధ్యయనంలో తేలింది.
రక్తంలో థైరాక్సిన్ హార్మోన్ తక్కువ శాతం ఉండటం వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్
కారణంగా బరువు పెరగడం, అలసట, అధిక సమయం నిద్రపోవుట, చలినితట్టుకోలేక పోవడం
వంటివి ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్యను అధిగమించాలంటే.. క్యాల్షియం గల
ఆహారాన్ని తీసుకోవాలి.
అయోడిన్, సెలీనియం వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసం, మష్రుమ్, సోయాబీన్, సన్ ఫ్లవర్ గింజలు, పాలకూర, నువ్వులు, వెల్లుల్లి తీసుకోవాలి. అయోడిన్ ఉప్పును మాత్రమే తీసుకోవాలి. రోజూ 4 నుంచి 5 గ్రాముల వరకు ఉప్పును తీసుకోవచ్చు.

ఆకుకూరలు తీసుకోవచ్చు. ఆకుకూరలు ఉడికించి ఆ
రసాన్ని తీసుకోవచ్చు. తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్ల రసాలు,
పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
0 comments:
Post a Comment