CSS Drop Down Menu

Saturday, July 28, 2018

రెస్టారెంట్‌లో "జీవితాంతం" ఫుడ్ ఫ్రీ ! ఉద్యోగం కూడా !! ఎందుకో తెలుసా ?

ఆ పాప రెస్టారెంట్లో పుట్టింది. అంతే ఇక బంపర్ ఆఫర్ కొట్టేసింది. జీవితాంతం ఆ రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం చేసే అవకాశాన్ని కొట్టేసింది. అంతేకాదు ఆ హోటల్‌ ఆ బుజ్జిపాపకు ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 17వ తేదీన టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉన్న చిక్ ఫిల్ ఎ రెస్టారెంట్‌కు రాబర్ట్ గ్రీఫిన్, మ్యాగీ దంపతులు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు.

అదే సమయంలో మ్యాగీకి పురిటి నొప్పులు రావడంతో రెస్ట్ రూమ్‌కు వెళ్లారు. తన స్నేహితుడి కారులో పిల్లలను ఇంటికి పంపించిన రాబర్ట్... రెస్ట్ రూమ్‌లో భార్యపక్కనే ఉండి సపర్యలు చేశాడు. పండంటి పాపాయికి జన్మనిచ్చింది మ్యాగీ. 

రెస్టారెంట్లోనే మ్యాగీ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ ఇద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన ఎమర్జెన్సీ వెహికిల్‌లో మ్యాగీని ఆస్పత్రికి తరలించారు. తమ హోటల్‌లో పాప పుట్టినందుకు యాజమాన్యం తనకు లైఫ్ లాంగ్ ఫుడ్ ఫ్రీ అని, తను పెరిగి పెద్దయ్యాక తమ రెస్టారెంట్‌లోనే ఉద్యోగం కూడా కల్పిస్తామని పేర్కొంది. దీంతో ఈ విషయాన్ని రాబర్ట్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిట్టితల్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Wednesday, July 18, 2018

రాత్రికి రాత్రి "కోటేశ్వరులు" అయిన ఊరి ప్రజలు ! ఎక్కడో తెలుసా?

మీరు నమ్మకపోయినా ఇది నిజం. ఒక వ్యక్తి తీసుకున్న సంచలన నిర్ణయమే ఇలాంటి అరుదైన పరిస్థితి కి కారణం.

నిత్యం పేదరికంతో చాలీచాలని సంపాదనతో బాధపడుతున్న ఆ ఊరి ప్రజలు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అవ్వడంతో  అక్కడఉన్న ప్రజలు ఉక్కరిబిక్కరికి గురిఅవుతున్నారు.

ఇది ఎలా సాధ్యం అని తెలుసుకోవాలి అంటే స్పెయిన్ కి చెందిన ఒక పెద్ద మనిషి గురించి మనం తెలుసుకోవాలి. అది ఎలా అంటే స్పెయిన్ లోని "కరోనా" అనే బీరు కంపెనీ యజమాని ఆంటోనినో ఫెర్నాండెజ్.


తన తల్లితండ్రుల పేదరికంతో చదువుకొనే స్తోమత లేక బడికి వెళ్లలేని బ్యాక్ గ్రౌండ్ అతనిది . స్కూల్ కి వెళ్లకపోవడంతో చిన్నతనంలోనే బీరు కంపెనీలో చేరాడు.

అనంతరం అంచెలుఅంచెలుగా ఎదిగి భారీ బీరు ఫ్యాక్టరీలు పెట్టేసాడు అలాగే భారీగా డబ్బులు సంపాధించిన తర్వాత తాను పుట్టి పెరిగిన ఊరు ఇంకా మారలేదు అని అక్కడ ప్రజలు ఇంకా పేదరికంతో మగ్గుతున్నారు అని తెలుసుకున్నాడు.

జీవితం చివరిదశలో ఉన్న అయన తాను పుట్టిన ఊరికి ఏదోకటి చేయాలి అని అనుకున్నాడు. అలా అనుకొని తాను చనిపోయిన తర్వాత తన ఆస్థిలో పెద్ద మొత్తం తాను పుట్టిన సెరెజాలెస్ డెల్ కాండడో ప్రజలకు చెందాలి అని కోరారు.

ఆలా వీలునామా రాసిన తర్వాత అయన చనిపోయాడు. అనంతరం అయన రాసిన వీలునామా ప్రకారం ఆ ఊరిలో ఉన్న 150 కుటుంబాలకు ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 కోట్లు జమ అయ్యాయి.

రాత్రికిరాత్రి తమ బ్యాంకు అకౌంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేరడంతో అక్కడ ప్రజలు అంతా షాక్ కు గురి అయ్యారు.డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అని ఆరాతీస్తే అసలు విషయం బయటకి వచ్చింది. 

















Wednesday, July 11, 2018

ఆ బిచ్చగాడు చేస్తున్న "పనుల"ను చూస్తే ఎవరైనా హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు !

ఓ బిచ్చగాడు దేవుడుకి కిరీటం చేయించాడు. దాని విలువ అక్షరాలా లక్ష రూపాయలు. అవును ఏ గుడి ముందు అయితే బిచ్చమెత్తాడో? ఏ దేవుడు అయితే ఇన్నాళ్లు ఏ కష్టం లేకుండా చూశాడో ఆ దేవుడికే తాను బిచ్చమెత్తగా వచ్చిన డబ్బుతో మొక్కు చెల్లించాడు.

నిజానికి బిచ్చగాడు అంటే ప్రతి ఒక్కరికీ లోకువే. సమాజం కూడా అతన్ని అతి చులకనగా, హేళనగా చూస్తుంది. కానీ, అతనిలో ఆవేదన, మానవత్వం మాత్రం ఎవరికీ పట్టదు. ఎవరు ఏమనుకున్నా.. ఎంత చీదరించుకుంటున్నా తన పని తాను చేసుకుంటూ పోతాడు. వచ్చిన డబ్బుతో నాలుగు మెతుకులు తింటాడు. ఏ బిచ్చగాడు అయినా చేసేపని ఇదే. 

కానీ, ఈ బిచ్చగాడు మాత్రం వారందరికీ భిన్నం. తనకు ఎలాంటి కష్టం లేకుండా చూసిన దేవుడుకి తాను భిక్షమెత్తగా వచ్చిన డబ్బుతో మొక్కు తీర్చుకున్నాడు. ఆ బిచ్చగాడు పేరు యాదిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నివాసి. ఈ ప్రాంతంలోని అనేక గుడుల ముందు కాషాయం ధరించి బిచ్చమెత్తుకుంటాడు. అలా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటాడు. మిగిలిన సొమ్మును దాచుకుంటాడు. 

అలా దాచిన సొమ్ము లక్ష రూపాయలు కాగానే గుళ్లకు దానం చేస్తాడు. మూడేళ్ల క్రితం లక్ష రూపాయలతో దత్తాత్రేయ స్వామికి వెండి పాదుకలు, తొడుకు చేయించాడు. యేడాది క్రితం ఓ ఆలయంలో అన్నదానం కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు సాయిబాబాకి లక్షా ఎనిమిది రూపాయలతో కిరీటం చేయించాడు. దీంతో ఆలయ కమిటీ యాదిరెడ్డిని ఘనంగా సన్మానించింది.



ఆలయాల ముందు భక్తులు ఇచ్చిన సొమ్ముతోనే ఈ ఆభరణాలు చేయిస్తున్నట్లు యాదిరెడ్డి తెలిపాడు. భక్తుల సొమ్ము ఆ స్వామికే చెందాలి అంటున్నాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టనని.. భక్తులు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను అంటున్నాడు. ఆ దేవుడే నాతో ఇవన్నీ చేయిస్తున్నాడని ఈ పరమ భక్త బిచ్చగాడు చెప్పుకొస్తున్నాడు. 

Wednesday, July 4, 2018

"జంతువుల"నే "లోగో"లుగా పెట్టుకున్న ప్రముఖ కంపెనీలు ఏవో తెలుసా?

"జంతువుల"నే "లోగో"లుగా పెట్టుకున్న ప్రముఖ కంపెనీలు ఏవో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో తప్పకుండా  చూడండి. 
ఈ వీడియో కనుక నచ్చితే  Like చేసి, మీ ఫ్రెండ్స్ కి Share చేయండి,అలాగే Subscribe చేయడం మాత్రం మర్చిపోకండి.