బీట్‌రూట్‌తో అధిక ఒత్తిడికి గుడ్‌బై
చెప్పవచ్చు. విపరీతమైన పనివేళలతో సతమతమవుతూ అధిక ఒత్తిడికి గురయ్యేవారు,
రోజుకు రెండు కప్పుల బీట్‌రూట్ రసం గనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి
అధిగమించవచ్చు.
బీట్‌రూట్‌లో విటమిన్ ఏ, బీ, సీ,
క్యాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, బీటా
కెరోటిన్, పీచు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ దుంపలో సహజ ఆక్సిడెంట్లుగా
పనిచేసే ఆంథోసైనడిన్లు పుష్కలంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి
బీట్‌రూట్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు ఎర్ర రక్త కణాలను
వృద్ధి చేసి, శరీరంలో రక్త శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి.
అదేవిధంగా బీట్‌రూట్‌లో లభించే పీచు
పదార్థాలు రక్త కణాలపై ఉండే అధిక కొవ్వును తొలగించి, మలబద్ధకం సమస్యను
అదుపులో ఉంచేందుకు సహాయకారిగా పనిచేస్తాయి. ఈ దుంపలో బిటైన్ అనే పదార్థం
అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వును కరిగించి, గుండె
జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. అలాగే మూత్ర పిండాలు, కాలేయంలో పేరుకున్న
మలినాలను తొలగించి, వాటి పనితీరును మెరుగుపరచటంలో బిటైన్ సమర్థవంతగా
పనిచేస్తుంది.
ఇంకా ఊపిరితిత్తులు, చర్మ సంబంధ
క్యాన్సర్లకు కారణమైన నైట్రోసమైన్లను బీట్‌రూట్‌లోని పోషకాలు ప్రభావవంతంగా
ఎదుర్కొంటాయి. ఇందులో లభించే సహజ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును
నియంత్రిస్తాయి. ప్రతిరోజూ వ్యాయామం, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు
పరగడుపునే ఒక గ్లాసు బీట్‌రూట్ రసం తీసుకోవాలి. ఈ రసంలో ఇనుము, క్యాల్షియం,
సీ విటమిన్లు శరీరానికి శక్తినందిస్తాయి. దాంతో శరీరం అలసిపోకుండా
ఉత్సాహంగా ఉంటుంది.
0 comments:
Post a Comment