CSS Drop Down Menu

Wednesday, October 7, 2015

ముఖంపై ముడతలు పడకుండా కాపాడే "దిండ్లు"

సాధారణంగా స్త్రీపురుషులు మరింత అందంగా కనిపించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇందుకోసం వారంతా పూయని క్రీములుండవు. చేయని ఫేషియల్స్ ఉండవు. వెళ్లని బ్యూటీపార్లర్ ఉండదు. ఇదంతా పగటిపూట మాత్రమే. రాత్రి పడకపై పడుకోగానే వారు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. మళ్లీ మరుసటి రోజు అందం కోసం తిప్పలు పడాల్సిందే. 
 
ఇలాంటివారి కోసం పరిశోధకులు సరికొత్త పిల్లోను కనిపెట్టారు. దాని పేరు ఇల్లుమినేజ్ స్కిన్ రీజువినేటింగ్ పిల్లోకేస్. ఇది ముఖంపై ముడతలు పడకుండా ఉండేలా చేస్తుందట. ఈ మెత్తను కాపర్‌తో తయారు చేశారు. ఇందులోని కాపర్ చర్మాన్ని తాజాగా ఉంచడంలో సాయపడుతుంది.
 
అలాగే, కొలాజిన్, ఎలాస్టిన్‌లు కూడా కలిపారట. ఇవి వయసు మీద పడినా, చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. ఈ పిల్లో తయారీకి వాడిన కూప్రన్ దారాల్లో కాపర్ ఆక్సైడ్ మిశ్రమం వాడారు. ఇవి చర్మం తాజాదనాన్ని కాపాడుతాయి. ఇంతకీ ఈ దిండు ధర కేవలం ఐదు వేలు మాత్రమే. కాగా, ఒక స్త్రీ తన జీవితకాలంలో అందం కోసం అక్షరాలా రూ.24 లక్షలు ఖర్చు చేస్తుందట. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. 


0 comments:

Post a Comment