అందంగా ఉన్నోళ్లకు ఆ హోటల్లో ఫ్రీమీల్స్
ఆఫర్ చేస్తారట. ఆ ఆఫర్ ఒక్కసారే కాదు.. భవిష్యత్తులోనూ కంటిన్యూ చేస్తామని ఆ
హోటల్ మేనేజర్ అంటున్నారు. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే..? అమెరికాలోని
వాషింగ్టన్‌లో. అసలు సంగతి ఏంటంటే.. వాషింగ్టన్‌లోని ఓ హోటల్లో కస్టమర్ల
కోసం ఓ బంపర్ ఆఫర్ పెట్టారు. ఉదయం హోటల్ తెరిచినప్పటి నుంచి వచ్చే మొదటి 50
మందికి మీల్స్ టోకెన్లు ఫ్రీగా ఇస్తారట.
అంటే ముందుగా వచ్చిన 50 మందిలో అందంగా
ఉన్నవారికే ఆ ఆఫర్ ఇస్తారట. అందంగా ఉన్నవారిని బేరీజు వేయడానికి ఆ హోటల్‌లో
బ్యూటీ ఐడెంటిఫికేషన్ ఏరియాను కూడా ఏర్పాటు చేసినట్లు ఆ హోటల్ మేనేజర్
చెప్తున్నారు.
ఈ బ్యూటీ ఐడెంటిఫికేషన్ ఏరియాలో ముక్కు,
కన్ను, పెదాలు, ముఖాకృతి అన్నీ పరిశీలిస్తారు. అన్నీ వాళ్లు అనుకున్నట్టు
ఉంటేనే టోకెన్ ఇస్తారు. అయితే ఎత్తుగా ఉన్నోళ్లను మాత్రం అందంగా
ఉన్నవారిగానే పరిగణిస్తారట. ఈ ఆఫర్ ద్వారా ఆ హోటల్‌కు కస్టమర్ల తాకిడి
విపరీతంగా ఉందని హోటల్ మేనేజర్ అంటున్నారు.
0 comments:
Post a Comment