ప్రియాంక చోప్రా డేంజరస్ హీరోయినా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు ఇంటర్నెట్
ఎక్స్‌పర్ట్స్. పొరపాటున ఇంటర్నెట్‌లో ఈమె పేరుతో సెర్చ్ చేస్తే
బుక్కైపోయినట్టేనని ఇంటెల్ సెక్యూరిటీ సంస్థ తాజా నివేదిక. సైబర్
నేరగాళ్లు బాలీవుడ్ నటీనటుల వ్యవహారాలకు సంబంధించిన గాసిప్స్‌నే
వినియోగదారులకు ఎరగా వేస్తున్నారట. ఇందులో ప్రియాంకా చోప్రానే టాప్
ప్లేస్‌లో వుందట. ఈమె బారినపడి చాలామంది నెట్ యూజర్స్ బుక్కైనట్టు సమాచారం.
ప్రియాంక పేరుతో సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్ పేజీలు ఓపెన్ అవుతున్నాయని,
వాటిలో వైరస్‌లు వుంటాయంటూ తేల్చింది. వాటిని డౌన్‌లోడ్ చేయగానే హ్యాకర్లు
మన కంప్యూటర్‌లో చేరి, నెటిజన్స్‌కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు,
ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు దొంగిలిస్తున్నారని నిపుణులు తేల్చారు.
ఇలాంటి విషయాలు డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని
హెచ్చరిస్తున్నారు. గతేడాది అలియాభట్‌కు సంబంధించిన వీడియోలు, వ్యవహారాలను
చూసేందుకు క్లిక్ చేసిన నెటిజన్స్.. హ్యాకర్స్ బారినపడగా, ఈ ఏడాది ఆ
స్థానంలోకి ప్రియాంకా వచ్చేసింది. ఇక శ్రద్ధాకపూర్ సెకండ్ ప్లేస్‌కి
వెళ్లింది. నెటిజన్స్ తస్మాత్ జాగ్రత్త!
0 comments:
Post a Comment