వార్షిక క్యాలెండర్‌లో 26వ తేదీని డేంజర్ డేట్‌గా
భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో సంభవించిన అనేక ఉత్పాతాలకు ఈ తేదీకి
లింకు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే 26వ తేదీని అత్యంత
ప్రమాదకర తేదీగా పరిగణిస్తున్నారు. 1700 సంవత్సరంలో జనవరి 26వ తేదీన ఉత్తర
అమెరికాలో సంభవించిన భూకంపం మొదలుకుని నిన్నటికినిన్న అక్టోబర్ 26వ తేదీన
హిందూకుష్ పర్వత ప్రాంతాల కేంద్రంగా వచ్చిన భూకంపం వరకు 26వ తేదీన
సంభవించినవే కావడం గమనార్హం. ఈ ఉత్పాతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా
భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది.
1700 సంవత్సరంలో జనవరి 26న నార్త్
అమెరికాలో భూకంపం, 1883లో ఆగస్టు 26న అగ్నిపర్వతం బద్దలు, 1926 జూన్ 26న లో
రోడ్స్ భూకంపం సంభవించింది. అంతేనా.. 1939 డిసెంబరులో టర్కీ భారీ భూకంపం,
1976 జూలైలో చైనా భూకంపం, 2003 డిసెంబరులో ఇరాన్ భూకంపం, 2010లో జూన్‌లో
తాసిక్, జలైలో తైవాన్ భూకంపాలతో పాటు.. మెంట్వా సునామీ సైతం 26వ తేదీనే
వచ్చాయి.
వీటితోపాటు ముంబై నగరంపై ఉగ్రదాడి (26/11),
2001లో గుజరాత్ భూకంపం, 2004 వచ్చిన సునామీ, నేపాల్‌లో 10 వేల మందిని
పొట్టన బెట్టుకున్న భూకంపం (ఏప్రిల్ 26వ తేదీ), నిన్న ఆప్ఘన్,
పాకిస్థాన్‌లలో తీవ్ర ప్రాణనష్టం కలిగించిన పెనుభూకంపం కూడా 26వ తేదీనే
వచ్చింది. దీంతో ప్రపంచ చరిత్రలో 26వ తేదీకి, ఉత్పాతాలకూ సంబంధముందన్న వాదన
మరింతగా బలపడినట్లయింది. వీటితో పాటు మరికొన్ని ఉత్పాతాలు.
1. జనవరి 26, 1531 : పోర్చుగల్ లిస్బన్‌లో భూకంపంలో 30 వేల మంది మృత్యువాత
2. జనవరి 26, 1700 : పసిఫిక్‌లో భూకంపం.
3. జూలై 26, 1805 : నేపాల్, ఇటలీ, కలబ్రియాలో భూకంపం. 26 వేల మంది మరణం.
4. ఆగస్టు 26, 1883 : అగ్నిపర్వతం బద్ధలు. మృతులు 36 వేల మంది.
5. డిసెంబర్ 26, 1861 : గ్రీస్‌లో భూకంపం.
6. మార్చి 26, 1872 : యూఎస్‌ఏలోని ఓవెన్స్ వ్యాలీలో భూకంపం.
7. ఆగస్టు 26, 1896 : లాండ్, ఐలాండ్, స్కైడ్‌లలో భూకంపం.
8. నవంబర్ 26, 1902 : బొహెమియా (ఇపుడు రిపబ్లిక్ ఆఫ్ కొరున)లో భూకంపం.
9. నవంబర్ 26, 1930 : ఇజులో భూకంపం.
10. సెప్టెంబర్ 26, 1932 : గ్రీస్, ఐరిస్సోస్‌లలో భూకంపం.
11. డిసెంబబర్ 26, 1932 : చైనాలోని కన్సులో భారీ భూకంపం, 70 మంది మృత్యువాత.
12. అక్టోబర్ 26, 1935 : కొలంబియాలో భూకంపం.
13. డిసెంబర్, 1939, టర్కీలోని ఇర్జిన్‌కాన్‌లో భూకంపం, 41 వేల మంది మృత్యువాత.
14. నవంబర్ 26, 1943 : టర్కీలోని టోయ లడిక్‌లో భూకంపం.
15. డిసెంబర్ 26, 1949 : జపాన్‌లోని ఇమైచ్చిలో భూకంపం.
16. మే 26, 1957 : టర్కీలోని బోలు అబాంట్‌లో భూకంపం.
17. మార్చి 26, 1963 : జపాన్‌లో వకాస్ బేలో భూకంపం.
18. జూలై 26, 1963 : యుగోస్లేవియాలో భూకంపం, వెయ్యి మంది మృతి.
19. మే 26, 1964 : శాండ్‌విచ్ దీవుల్లో భూకంపం.
20. జూలై 26, 1967 : టర్కీ, పులుమూరులో భూకంపం.
21. సెప్టెంబర్ 26, 1970 : కొలంబియాలో బహియా సొలానోలో భూకంపం.
22. జూలై 26, 1971 : సాల్మాన్ దీవుల్లో భూకంపం.
23. ఏప్రిల్ 26, 1972 : టర్కీ ఎజైన్‌లో భూకంపం.
24. మే 26, 1975 : నార్త్ అంట్లాటిక్‌లో భూకంపం.
26. మార్చి 26, 1977: టర్కీలోని పలులో భూకంపం.
26. డిసెంబర్ 26, 1979 : ఇంగ్లండ్‌లోని కర్లీస్లీలో భూకంపం.
27. ఏప్రిల్ 26, 1981 : యుఎస్ఏలోని వెస్ట్‌మోర్లాండ్‌లో భూకంపం.
28. మే 26, 1983 : జపాన్‌లోని చుబు, నిహోంకైలో భూకంపం.
29. జనవరి 26, 1985 : అర్జెంటీనా, మెండోజాలో భూకంపం.
30. జనవరి 26, 1986 : యుఎస్ఏలోని ట్రెస్ పినోస్‌లో భూకంపం.
31. ఏప్రిల్ 26, 1992 : యూఎస్ఏ, కాలిఫోర్నియా, కేప్ మెండోనికాలో భూకంపం.
32. అక్టోబర్ 26, 1997 : ఇటలీలో భూకంపం.
33. డిసెంబబర్ 26, 2004 : సుమత్రా దీవుల్లో సునామి.
34. మే 26, 2006 : జకర్తాలో భూకంపం.
35. జూన్ 26, 2010 : టాసిక్‌లో భూకంపం.
36. అక్టోబర్ 26, 2010 : మెంత్వానిలో సునామీ.
0 comments:
Post a Comment