CSS Drop Down Menu

Saturday, October 24, 2015

అత్యాచారం" దెబ్బతో "కురచ దుస్తులు" మానేసా !

కలర్స్ ఛానల్ ప్రసారం చేసే రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 6 వీక్షించిన వారికి సప్నాభవ్‌నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మగాళ్లను అనుకరించే డ్రెస్ కోడ్, ఒంటి నిండా టాటూలతో కాస్త చిత్రంగా కనిపించే ఆమె ఫెమినిస్ట్‌గా పేరు కొట్టేశారు. హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన సప్నాభవ్‌నానిని ఆమె గతమే ఫెమినిస్టుగా మార్చేసిందని చెప్పుకొచ్చింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్ బుక్ పేజ్‌లో ఆమె తన గత అనుభవాల వాస్తవాల్ని వెల్లడించారు. 
 
24 ఏట  తాను సామూహిక అత్యాచారానికి గురైనట్లు చెప్పింది. అప్పటి నుంచి రెడ్ లిప్ స్టిక్, కురచ దుస్తులు వేసుకోకుండా వదిలేశానని వెల్లడించింది. సామూహిక అత్యాచారానికి గురైతే ఆ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో, ఎంత మానసిక సంఘర్షణకు గురవుతారో చెప్పడం సాధ్యం కాదని సప్నాభవ్‌నాని తెలిపింది.
 
తాను వయసులో ఉండగా ముంబైలో బైక్ నడిపేదాన్నని, సిగరెట్లు, బీరు తాగేదాన్నని సప్నాభవ్‌నాని చెప్పుకొచ్చింది. అందరూ వింతగా చూసేసరికి షికాగో వెళ్లి సెటిలయ్యానని చెప్పింది. క్రిస్మస్ సందర్భంగా ఒకరోజు అర్ధరాత్రి ఓ బార్‌కు వెళ్లానని, బార్ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న తన మెడపై తుపాకి పెట్టి నలుగురు మాస్టర్ బేట్ చేయమన్నారని, ఆ తరువాత జరిగినది అంతా ఊహించుకోవచ్చని తెలిపింది. 
 
ఈ ఘటన తనను చాలా కాలం వెంటాడిందని సప్నా తెలిపింది. అప్పటి నుంచి రెడ్ లిప్ స్టిక్, కురచ దుస్తులు వదిలేశానని చెప్పింది. ఈ విషాదాన్ని ప్రపంచానికి చెప్పేందుకు 20 ఏళ్లు పట్టిందని సప్నా తెలిపింది. ఇప్పుడు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉందని సప్నా పేర్కొంది. అందుకే చెప్పానంది. 

0 comments:

Post a Comment