ఎన్నో చిత్రాలతో ఎన్నో రకరకాల
పాత్రలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్ ఐరన్‌లెగ్
శాస్త్రి మరణం తరువాత తన ఫ్యామిలి ఆర్థింకంగా ఎన్నో ఇబ్బందులకి
గురవుతున్న విషయం తెలిసిందే. హృదయకాలేయం చిత్రంతో బర్నింగ్‌స్టార్‌గా
ఎదిగిన సంపూర్ణేష్ బాబు మీడియా ద్వారా తెలుసుకుని, ఐరన్‌లెగ్ శాస్త్రి
ఫ్యామిలీకి తన వంతు సాయం చేశారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. గురువుగారు
ఐరన్‌లెగ్ శాస్త్రి తెలుగు ప్రేక్షకుల్ని ఏవిధంగా నవ్వించారో అందరికీ
తెలుసు. ఆయన హాస్యానికి విలువ కట్టలేము. అలాంటి ఆయన ఫ్యామిలీ ఇప్పడు
ఆర్ధికంగా ఇబ్బందిపడుతుందనే విషయం మీడియా ద్వారా విని ఆయన కుమారుడు
ప్రసాద్ ఫోన్ నెంబరు కనుక్కుని నాకు తోచిన సాయం 25,000 రూపాయిల చెక్‌ని
అందించాను. ఇలానే మన పరిశ్రమలోనివారంతా తమకు తోచిన విధంగా వారి
ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు
ఐరన్‌లెగ్ శాస్త్రి కుమారుడు ప్రసాద్
మాట్లాడుతూ.. సంపూర్నేష్ బాబు గారు మా ఫ్యామిలీ పరిస్థితి తెలుసుకుని మాకు
సహాయాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు. నాన్న గారి మరణం తరువాత
మా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. నిత్యావసర
వస్తువులకు కూడా ఇబ్బంది పడుతున్నాము. పరిశ్రమలోని పెద్దలు కూడా మా
ఫ్యామిలీని ఆదుకుంటారని ఆశిస్తున్నాం.. అని అన్నారు.
0 comments:
Post a Comment