CSS Drop Down Menu

Tuesday, October 27, 2015

బరువు తగ్గాలంటే?పండ్ల రసాల్లో "పంచదార" వేసుకోకండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే తాజా పండ్ల రసాలను తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ పండ్ల రసాల్లో పంచదారను ఎక్కువగా చేర్చుకోకూడదంటున్నారు. ఫ్రెష్ జ్యూస్‌లను సేవించేటప్పుడు పంచదార, ఐస్ ముక్కల్ని పక్కనబెట్టేయాలని వారు సూచిస్తున్నారు. ఐస్ క్యూబ్స్ వాడటం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్లతో పాటు జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయని.. అందుచేత బరువు తగ్గాలనుకునేవారు ఐస్ క్యూబ్స్, పంచదారను మితంగా తీసుకోవడం మంచిది. 
 
సాధారణంగా బరువు తగ్గటానికి వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. నిజానికి బరువు తగ్గేందుకు లేదా పెరగకుండా ఉండేందుకు ఘన పదార్థాలు తినడం మానేసి ద్రవ పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. ద్రవ పదార్థాలు అనగానే చాలా మంది మనస్సు పండ్ల రసాలపైకి పోతుంది. పండ్ల రసాలు ఆరోగ్యం శక్తి రెండూ ఇస్తాయన్నది నమ్మకం. అయితే, పూర్తిగా పండ్ల రసాల మీద ఆధారపడే వారు బరువు తగ్గి తీరుతారనే గ్యారెంటీ లేదు. పండ్ల రసాలకు తోడుగా ఆ వ్యక్తి వంశపారంపర్య లక్షణం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 
 
పండ్లలో తక్కువ క్యాలరీల శక్తి ఉండటం వాస్తవమే అయినా బరువు పెరిగే జన్యు లక్షణం లేనివారికి మాత్రం ద్రవపదార్థాలతో కూడిన ఆహారంతో మేలు కలుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 


0 comments:

Post a Comment