నితిన్‌పై సమంత గుర్రుగా ఉంటుందట.
త్రివిక్రమ్ సినిమా అ.. ఆ..తో కమిట్ అయ్యాక నితిన్ అల్లరి పేరిట ఓవరాక్షన్
చేస్తుండటంతో సమంత ఓపిక నశించిందట. ఒక స్టేజ్‌లో నోరుమూసుకోమని కసురుకుందట.
ఇక చేసేది లేక నితిన్ స్టాపైపోయాడట. హీరో, హీరోయిన్స్ మధ్య ఎంత వరకూ
చనువుంటే అంత బాగుంటుందనే విషయాన్ని సమంత నితిన్‌కు చెప్పిందట.
ఇకపోతే.. సమంత, నితిన్ కాంబినేషన్‌లో
త్రివిక్రమ్ డైరక్టర్‌గా ఓ మూవీ రాబోతోంది. ఈ మూవీలో నితిన్‌ని సరికొత్తగా
చూపేందుకు త్రివిక్రమ్ సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి
త్రివిక్రమ్, మరో పెద్ద హీరో కాంబినేషన్ అయితే.. త్రివిక్రమ్ గురించి
మీడియా గొప్పగా చెప్పేది. కానీ ఇఫ్పుడు త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్
కావడంతో తివిక్రమ్ గురించి మీడియా చిన్నచూపు చూపిస్తోంది. దీనికి కారణంగా
త్రివిక్రమ్‌కి పెద్ద హీరోల కాల్షీట్స్ దొరక్కపోవడమే.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా హీరోయిన్
సమంతతో నితిన్ వెరీ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడట. సమంతని ఇష్టం వచ్చినట్లు
మాట్లాడుతున్నాడట. ఏదో సందర్భం కాకపోయినా... తనతో ఏదోకటి మాట్లాడే
ప్రయత్నాలు చేయడంతో కోపం వచ్చిన సమంతకి నితిన్‌ని నోరుమూసుకో అంటూ
చెప్పుకొచ్చింది. అంతేగాకుండా నితిన్‌ని చాలావరకూ లిమిట్స్‌లో పెట్టేందుకు
సమంత ముందస్తు జాగ్రత్తలో ఉంటుందట. లేదంటే నితిన్ చేసే అల్లరిని భరించడం
సమంతకి కష్టంగా ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment