CSS Drop Down Menu

Thursday, October 8, 2015

"డేటింగ్ కోర్సు"ను ప్రవేశపెట్టిన చైనా యూనివర్శిటీ !

నేటి యువత మద్యం, డేటింగ్ మత్తులో తూలుతోంది. కానీ చైనాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం ఏకంగా డేటింగ్‌ కోర్సును ప్రారంభించింది. ఇందులో డేటింగ్‌ ఏవిధంగా చేయాలో ప్రాక్టికల్‌ రూపంలో మెళకువలు బోధిస్తారు. ఈ యూనివర్శిటీ పేరు తియాంజిన్ యూనివర్శిటీ. చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. 
 
ఈ కోర్సులో డేటింగ్‌తో పాటు మేకింగ్ ఫ్రెండ్స్ అనే కోర్సు కూడా ఉంది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయని యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. ఈ కోర్సులో 32 గంటల పాటు క్లాసులు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసే విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహిస్తారు. 
 
రెండు దఫాలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు డేటింగ్‌కు అర్హత సాధించినట్టే. అబ్బాయిలు, అమ్మాయిల్లో ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారికి ఎక్కువ మార్కులు వస్తాయని కోర్సు డైరెక్టర్ కాంగ్ ఇంగ్ తెలిపారు.
 


0 comments:

Post a Comment