సాధారణంగా ఒక అమ్మాయిని ప్రత్యక్షంగా చూసి
ఆ అమ్మాయి ఎలాంటిదో కొంతమంది చెప్పగలరు. అయితే, ఆస్ట్రేలియా
విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం
వెలుగులోకి వచ్చింది. పలువురు మగాళ్లు అమ్మాయి ఫోటో చూసి ఆ అమ్మాయి
లక్షణాలు, గుణగణాలు ఖచ్చితంగా చెపుతారట. అమ్మాయి ఫోటో చూసి ఆమె ఎలాంటిది?
నమ్మకస్తురాలా? కాదా? అనే విషయాలు చెప్పగలిగే సామర్థ్యం పురుషుల్లో
సహజసిద్ధంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
ఈ పరిశోధనలో భాగంగా కొంత మంది పురుషులను
తీసుకుని, రెండు భాగాలుగా విభజించారు. వారికి కొందరు అమ్మాయిల ఫోటోలు
చూపించారు. రెండు విభాగాల్లోని పురుషులు ఇంచుమించు ఒకేలా స్పందించారు.
అంతకుముందే ఆ అమ్మాయిలు ఎలాంటి వారో తెలుసుకున్న పరిశోధకులు, పురుషులు కూడా
అలాంటి సమాధానాలే చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపోయి, పురుషుల్లో సమజసిద్ధంగా ఆ
లక్షణం వచ్చేస్తుందని చివరికి పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.
0 comments:
Post a Comment