కొత్తగా వచ్చిన ఐఫోన్ 6ఎస్ కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా
కొనుగోలుదారులు పోటీపడుతున్నారు. చైనాలో ఐఫోన్‌కు నానాటికీ క్రేజ్
పెరిగిపోతూనే ఉంది. అయితే ఓ యువతి తనకు ఐఫోన్ కొనివ్వలేదనే కారణంతో ఆమె
ప్రియుడికి చుక్కలు చూపించింది.
తనకు ఐఫోన్ 6ఎస్ కొనివ్వలేదనే కారణంగా ప్రియుడితో వాగ్వాదానికి దిగింది.
అంతేగాక, ఆగ్రహంతో ఊగిపోతూ.. ఎంతో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో. ఒంటిపై
ఉన్న దుస్తులన్నీ విప్పేసింది. నగ్నంగానే అతనితో ఘర్షణ పడింది.
చైనాలోని నంజింగ్ ప్రాంతానికి చెందిన ఆ యువతి చేసిన బీభత్సానికి ఆమె
ప్రియుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు
ఐఫోన్ 6ఎస్ కొనివ్వలేదని తన ప్రియుడితో పెద్ద గొడవ చేసిందీ యువతి.
ఎంత గొడవ చేసినా కొనిచ్చేందుకు అంగీకరించకపోవడంతో చైనాలోనే రద్దీగా
ఉండే ఆ మార్కెట్ ప్రాంతంలో మొత్తం బట్టలు విప్పేసి నగ్నంగా అతనితో
వాగ్వాగానికి దిగింది. దీంతో బిత్తరపోయిన ప్రియుడు అక్కడ్నుంచి
వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.
అయినా అతడ్ని వదలకుండా ఆమె ఐఫోన్ కోసం అతనితో పోరాటం కొనసాగించింది. కాగా, ఈ
మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాల్లో పోస్ట్
చేశారు. అయితే ఐఫోన్ కోసం ఇలాంటి ఘటనలో చైనాలో చాలా చోటు చేసుకుంటున్నాయి.
చైనాకు చెందిన ఇద్దరు యువకులు ఐఫోన్ కోసం ఏకంగా తమ కిడ్నీలనే అమ్మేందుకు
ప్రయత్నించిన విషయం తెలిసిందే. చైనాలోని ఓ ఆస్పత్రి ‘వీర్యం దానం చేసి
ఐఫోన్ పట్టుకెళ్లండి' అంటూ ఓ గొప్ప ఆఫర్‌ను కూడా ప్రకటించేసింది.
0 comments:
Post a Comment