మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర
పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌తో రాణించిన హీరో. ఈ హీరో నటించిన
149 చిత్రాల్లో అనేక రికార్డులు ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం నిర్మించిన ఈ
చిత్రాలు నేటికీ బద్ధలు కాలేక పోతున్నాయి. అలాంటి చిత్రాల్లో హీరో
మెగాస్టార్ నటించాడన్నమాట.
అయితే, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్
హీరోగా, రానా ప్రతినాయకుడిగా వచ్చిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం రాష్ట్ర,
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. సరికొత్త
చరిత్రను లిఖించింది. చిత్ర కలెక్షన్లలో రూ.100 కోట్లను సులభంగా
అధికమించి.. ఏకంగా రూ.600 కోట్ల మేరకు వసూలు చేసినట్టు ఫిల్మ్ ట్రేడ్
వర్గాల సమాచారం. ఇన్ని రికార్డును తిరగరాసిన ఈ చిత్రం.. మెగాస్టార్
చిరంజీవి సృష్టించిన రికార్డ్‌ను మాత్రం బద్దలకొట్టలేక పోయింది. అదీ కూడా ఓ
చిన్న ఊరిలో... వివరాల్లోకి వెళ్తే...
నిజానికి ఇప్పటివరకూ ఇండస్ట్రీ హిట్‌గా
ఉన్న మగధీర, పోకిరి, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు మెగాస్టార్
రికార్డ్‌ను టచ్ చేయలేక పోయినా... బాహుబలి కలెక్షన్ల ప్రభంజనం చూస్తే
ఖచ్చితంగా ఈ చిత్రం చిరంజీవి రికార్డును తిరగరాస్తుందని అందరూ భావంచారు.
కానీ బాహుబలి సైతం చిరు రికార్డు దరిదాపుల్లోకి రాలేక పోయింది.
ఇంతకీ మెగాస్టార్ రికార్డ్ టచ్ చేయని ఊరు
ఏమిటో తెలుసా... తూర్పుగోదావరి జిల్లాలోని తుని పట్నం. తునిలో 13 సంవత్సరాల
క్రితం.. ఇంద్ర సృష్టించిన కలెక్షన్ల రికార్డును ఇప్పటివరకూ ఏ హీరో కూడా
టచ్ చేయలేక పోయారు.. పోతున్నారు కూడా. తునిలో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి
సినిమా ఇంద్ర రూ.17.56 లక్షలు వసూలు చేసింది. ఇప్పటివరకూ ఈ కలెక్షన్‌ను ఏ
సినిమా క్రాస్ చెయ్యలేదు. బాహుబలి కూడా టచ్ చేయలేదు.
ఈ చిత్రం వసూలు రూ.14 లక్షల వద్దే
ఆగిపోయింది. 13 ఏళ్ళ క్రితం సినిమా టికెట్ ధరకు ఇప్పటి టికెట్ ధరకు చాలా
వ్యత్యాసం ఉన్నప్పటికీ.. గత రికార్డును చేరుకోలేక పోవడం గమనార్హం. దీంతో
మెగాస్టార్ పవర్ ఏమిటో మరో సారి తేటతెల్లమయింది. స్క్రీన్‌పై మెరిసి
ఎనిమిదేళ్లయినా.. ఆయన కోసం అభిమానులు అంతగా ఎదురుచూస్తున్నారంటే...
మెగాస్టార్ క్రేజ్ ఏమిటో అర్థమవుతుంది.
0 comments:
Post a Comment