చినబాబు క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైమొచ్చినట్టు
కనిపిస్తోంది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కీలక భూమిక
పోషిస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఇక మీదట ఏపీ కేబినెేట్ లో
చేరి తన సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు. లోకేష్ ను మంత్రివర్గంలోకి
తీసుకుని కీలక శాఖలు అప్పగిస్తే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత తోడ్పాటు
వస్తుందని టీడీపీ నేతలు చంద్రబాబుమీద వత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు
తీసుకెళ్తున్న లోకేష్ ను ప్రభుత్వంలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్
చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, తన తనయుడు కేటీఆర్ ను ప్రభుత్వంలోకి తీసుకుని కీలక
శాఖలు అప్పగించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
ఇప్పటికే అనేక కీలక పరిశ్రమలు ఏపీకి రావడంలో లోకేష్ పాత్ర ఉంది. అతని
వ్యక్తిగత పరిచయాలు, ఎన్నారైలతో గల సంబంధాలు, లోకేష్ ఆలోచనా విధానం
ఆంధ్రప్రదేశ్ కు ఎంతో అవసరమని టీడీపీ నేతలు అంటున్నారు.
లోకేష్ ను కేబినెేట్ లోకి తీసుకుంటే ప్రొటోకాల్ ఇబ్బందులు కూడా తలెత్తవని
వారు చెబుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని లోకేష్ కు ఐటీ,
ఇండస్ట్రీస్ వంటి శాఖలిచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరింత వేగవంతం
చేయాలని వారు చంద్రబాబును కోరుతున్నారు. రాజధాని నిర్మాణం, ఆంధ్రప్రదేశ్
ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్న ప్రస్తుత తరుణంలో లోకేష్ సేవలు
ప్రభుత్వానికి ఎంతో అవసరమని వారు వాదిస్తున్నారు.
0 comments:
Post a Comment