CSS Drop Down Menu

Tuesday, October 6, 2015

విటమిన్ "సి" ఉండే పండ్లను తినండి ! ఒంట్లో " కొవ్వు 30 శాతం" కరిగించుకోండి !!

వ్యాయామం చేయడంతో పోలిస్తే విటమిన్ సి శరీరానికి సరిపడా తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు 30 శాతం అదనంగా కరుగుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన నిపుణులు చెపుతున్నారు. కనుక నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
 
విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే తీవ్రత చాలావరకూ తగ్గుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ పోషకాల వల్ల రక్త కణాల పనితీరు మెరుగుపడుతుంది. దీనితో శరీరంలో రక్తసరఫరా సజావుగా సాగి సమస్యలు తగ్గుతాయి.
 
అలాగే కాలుష్యం, ఒత్తిడి, సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ మొదలవుతాయి. విటమిన్ సి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. దాంతో అందంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.

0 comments:

Post a Comment