CSS Drop Down Menu

Wednesday, September 30, 2015

అఖిల్ ని "తిట్టి, కాలర్ పట్టుకుని" తీసుకెళ్లిన హీరో ? ఎందుకు ??

మైండ్ దొబ్బిందా? అంటూ తిట్టిపోశాడు.. నా కాలర్ పట్టుకుని తీసుకెళ్లాడు? అంటూ యువహీరో అఖిల్ వాపోయాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అని ఆరా తీస్తే... అఖిల్ చిత్ర నిర్మాత, మరో టాలీవుడ్ హీరో నితిన్ అని తేలింది. ఇంతకీ అఖిల్ కాలర్ పట్టుకోవాల్సిన అవసరం నితిన్‌కు ఎందుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే... 
 
నితిన్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా చెయ్యరాబాబు అంటూ నితిన్ ప్రోత్సహించి ఉండకపోతే చేసేవాడిని కాదు. అలాగే, వివి వినాయక్ సినిమా మామూలు విషయం కాదని చెబుతూ, నితిన్ ఈ కథను తనకు వినిపించాడని అఖిల్ తెలిపాడు. సినిమా కోసం సుధాకర్ రెడ్డి, వినాయక్ ఎంతో శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చాడు. 
 
ఇక ప్రిన్స్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. నా తొలి చిత్రం అఖిల్ ఆడియోపై బైట్ ఇవ్వండి అని మహేష్ బాబుగారిని అడిగితే, 'బైట్ దేముంది, నేనే వస్తానని భరోసా ఇచ్చారు. అలాగే వచ్చారు. నన్ను ప్రోత్సహించారు. ఆయన మంచితనానికి ధన్యవాదాలు' అని అఖిల్ అన్నాడు. నితిన్ - అఖిల్‌లు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న విషయం తెల్సిందే. 


0 comments:

Post a Comment