CSS Drop Down Menu

Monday, October 26, 2015

శంకుస్థాపనకు ఎన్టీఆర్ ను దూరంపెట్టేసారు?

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండడానికి కారణం ఆయనకు  అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక అందకపోవడమే. ఇది జూనియర్ ఎన్టీఆర్‌‌‌‌‌‌కు, టీడీపీ పార్టీ మధ్య అంతరం మరింత పంచేలా కనిపిస్తోంది. అంతేకాకుడా, చంద్రబాబే ఉద్దేశ్యపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కనబెట్టేశారనే ప్రచారం జోరుగాసాగుతున్న ఈ తరుణంలో ఇపుడు ఆహ్వాన పత్రికను కూడా పంపించక పోవడం దీన్ని రుజువు చేసేలా కనిపిస్తోంది. 
 
నిజానికి హీరో పవన్ కళ్యాణ్ దగ్గరకు ఏపీ మంత్రులు కొందరు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రం అందజేస్తే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు మంత్రులు కాదు కదా ప్రత్యేక దూతలు కూడా వెళ్ళలేదు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాల్లో అటు హరికృష్ణ గానీ, ఇటు జూనియర్ గానీ చురుకుగా పాలు పంచుకోవడం లేదు. సినిమాల్లో బిజీగా ఉంటున్నాననే నెపం మీద జూనియర్ సైతం పార్టీని పట్టించుకోవడం మానేశాడు.
 
బాబు తన కొడుకు లోకేష్‌‌కు పార్టీ వ్యవహారాల్లో ప్రాధన్యత ఇస్తూ తన వారసుడిగా పరోక్షంగా పెద్ద పీట వేస్తుండటాన్ని జూనియర్ పసిగట్టేశాడు. దాంతో ఇక సినిమాలే అతని లోకమైపోయింది. చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ కూడా జూనియర్‌‌తో అంటీ ముట్టనట్టు ఉండటంతో ఈ ఫ్యామిలీ దాదాపు ఎవరికి వారే అన్నట్టు మారిపోయింది. 


0 comments:

Post a Comment