జీడిపప్పు వద్దు ఆక్రోటే ముద్దంటున్నారు
న్యూట్రీషన్లు. ఆక్రోట్ తీసుకోవడం ద్వారా మధుమేహానికి చెక్ పెట్టవచ్చునని
న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేవాళ్లు జీడిపప్పు
వంటి వాటి జోలికి వెళ్లకుండా.. బాదం, పిస్తా వంటివి తీసుకోవాలి.
డ్రైఫ్రూట్స్ తీసుకునే అలవాటున్నవారు.. ఇకపై వాల్ నట్స్ అనే ఆక్రోటును కూడా
డైట్ లిస్టులో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఎందుకంటే..? వారానికి రెండు మూడుసార్లు
ఆక్రోటు తినే వారికి మధుమేహం సోకే అవకాశాలు తగ్గుతాయని బోస్టన్ పరిశోధనల
ద్వారా వెల్లడైంది. దాదాపు లక్షన్నర మంది నర్సుల మీద పరిశోధనలు చేస్తే..
మధుమేహం ఫేజ్2కు వెళ్లే ప్రమాదం 24 శాతం తగ్గినట్టు గుర్తించారట.
మగవాళ్లమీద కూడా ఆక్రోటు ప్రభావం ఇలాగే ఉంటుందని వారంటున్నారు.
0 comments:
Post a Comment