CSS Drop Down Menu

Wednesday, October 14, 2015

"జేమ్స్ బాండ్' గా "నటించడం కంటే చచ్చిపోవడం బెటర్" ?

ప్రపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కించుకోవాలంటే మామూలు విషయం కాదు. నటనతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్నీ పర్ ఫెక్టుగా పండించగలగాలి. అంతకంటే ముఖ్యంగా  ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే విధంగా తెరపై సాహస విన్యాసాలు పండించగలగాలి. ఇవన్నీ చేయడానికి తెర వెనక ఎంత కష్టం, శ్రమ దాగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే మూడు సార్లు జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరోగా నటించిన డేనియల్ క్రెగ్ త్వరలో రాబోతున్న బాండ్ మూవీ ‘స్పెక్టర్' సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత తాను మరోసారి జేమ్స్ బాండ్ పాత్ర చేయనుగాక చేయను అంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డేనియర్ క్రెగ్ మాట్లాడుతూ ‘మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా' అని వ్యాఖ్యానించారు.

0 comments:

Post a Comment