ప్రతి ఒక్కరికీ జననమరణాలు తప్పనిసరి.
అయితే, స్త్రీల కంటే పురుషులే ముందుగా చనిపోతారట. పూర్వకాలంలో ఆడవారైన,
మగవారైనా 100 సంవత్సరాలు బ్రతికేవారు. క్రమేణా ఇది వందేళ్ళ నుంచి 60
సంవత్సరాలకు తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ సౌతెర్న్
కాలిఫోర్నియాకు చెందిన పరిశోధక బృందం ఓ పరిశోధన చేసింది.
ఇందులో స్త్రీలకంటే పురుషులే ముందుగా
చనిపోతున్నట్టు తేలింది. దీనికి కారణం లేకపోలేదు. మానసిక ఒత్తిడి,
బాధ్యతలు, కుటుంబ సమస్యలతో పాటు చెడు అలవాట్లు కారణంగా పురుషులకు మృత్యువు
ముందుగా సంభవిస్తుందని నిపుణులు చెపుతున్నారు.
అయితే, ఈ సమస్య ఏ ఒక్క దేశంలోనో లేదని,
ప్రపంచ వ్యాప్తంగా ఉందని అంటోంది. అయితే మగవాళ్లు ఎక్కువగా హార్ట్‌ఎటాక్‌తో
చనిపోతున్నారని తేల్చింది. అంతేకాకుండా, పొగ త్రాగడం తగ్గిస్తే కొంత వరకు
హార్ట్ ఎటాక్ ద్వారా చనిపోయే మరణాలను తగ్గించవచ్చంటున్నారు నిపుణులు.
0 comments:
Post a Comment