సాధారణంగా తల్లి కడుపు నుంచి పుట్టిన
తర్వాత ఆడబిడ్డో.. మగబిడ్డో తేలిపోతోంది. ఒకవేళ మగాడిగానో, ఆడవారిగానో
మారాలంటే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. కానీ, ఆ ఊర్లో మాత్రం ఆడపిల్ల
పుట్టిన తర్వాత 12 యేళ్ళకు మగబిడ్డగా మారిపోతుంది. దీంతో తల్లిదండ్రులు
లబోదిబో మంటున్నారు. ఈ విచిత్ర సంఘటన కరేబియన్ దీవుల్లోని డొమినికన్
రిపబ్లిక్‌లో జరుగుతోంది. ఇక్కడే ఎందుకు ఇలా జరుగుతుందన్న అంశంపై వైద్యులను
సంప్రదిస్తే...
బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఎంజైమ్ లోపం
కారణంగా ఆడశిశువుగా పుట్టాల్సింది మగబిడ్డగా మారిపోతుంది. దీనికి కారణం
ఆడపిల్లగా పుట్టిన వారిలో డీ హైడ్రో టెస్టోస్టిరాన్ అనే హర్మోన్. దీనివల్ల
ఆడపిల్లకు 12 సంవత్సరాల వయస్సు రాగానే మగపిల్లలైపోతారు. ఆడపిల్లలు
మగపిల్లలుగా మారడాన్ని శాస్త్ర పరిభాషలో 'గెవెడాసెస్' అని పిలుస్తారని
వైద్యులు చెబుతున్నారు.
ఇక డొమెనిక్ రిపబ్లిక్‌లో ఎంతమంది
ఆడపిల్లలు మగపిల్లలుగా మారుతున్నారనే విషయాని కొస్తే, ప్రతి 90 మందిలో ఒకరు
ఇలా మారిపోతున్నారు. సాలినాస్ పట్టణంలో అయితే ప్రతి 90 మందిలో ఇద్దరు ఆడ
శిశువులుగా పుట్టి తమ 12వ సంవత్సరంలో మగబిడ్డలుగా మారిపోతున్నారు. ఇటువంటి
సంఘటన మొట్టమొదటిసారి 1970లో వెలుగుచూసిందని డాక్టర్ మైఖేల్ మోస్లే
వివరిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కష్టమని, ఎందుకంటే
జన్యులోపం వల్లే ఇలా జరుగుతుందని చెపుతున్నారు.
0 comments:
Post a Comment