CSS Drop Down Menu

Saturday, September 12, 2015

మహేష్ బాబు ఫై " వివాదాస్పద వ్యాఖ్యలు" చేసిన దర్శకుడు తేజ !

‘శ్రీమంతుడు' సినిమా ద్వారా మహేష్ బాబు ఒక మంచి మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లారు. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు... తమ సొంతూర్లను, వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరుచాలనే కాన్సెప్టును సినిమాలో చెప్పడమే కాదు... పలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా చూసి ఇన్ స్పైర్ అయి పలువురు ప్రేక్షకులు, ఇతర స్టార్స్ కూడా గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అయితే దర్శకుడు తేజ మహేష్ బాబు చేస్తున్న ఈ పనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు ఇన్ కం టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాలను దత్తత తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. హోరా హోరీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన తేజ మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు గురించి ఇలా కామెంట్ చేసారు.


1 comment:

  1. తన స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుంటామని ప్రిన్స్‌ మహేష్‌బాబు ప్రకటించారు. Real Hero Mahesh Babu more movie updates

    ReplyDelete